విద్య, వైద్య రంగాలకు ప్రజా ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత... రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధికి స్కిల్ యూనివర్సిటీ, ప్రతి నియోజకవర్గంలో అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్‌లు

అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు, అర్హులైన ప్రతి ఒక్కరికీ కొత్త పింఛన్*   రూ.30 లక్షలతో గోపాలపురం పాఠశాలలో రెండు అదనపు తరగతి గదుల నిర్మాణం పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి
Published On
విద్య, వైద్య రంగాలకు ప్రజా ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత... రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

ఖమ్మం, ఆగస్టు -27: లోకల్ గైడ్:

విద్య, వైద్య రంగాలకు ప్రజా ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు.

తిరుమలాయపాలెం మండలం ఎర్రగడ్డ గ్రామ పంచాయతీ పరిధి గోపాలపురంIMG-20260827-WA0069
గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో రూ.30 లక్షల వ్యయంతో నిర్మించనున్న రెండు అదనపు తరగతి గదుల నిర్మాణానికి గురువారం మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ తో కలిసి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా *మంత్రి  పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ*  రూ.30 లక్షలతో రెండు అదనపు తరగతి గదుల నిర్మాణాన్ని చేపడుతున్నామని తెలిపారు. విద్యార్థుల కోసం తాత్కాలిక షెడ్డు నిర్మించేందుకు టీచర్ సుమారు రూ.40 వేల సొంత డబ్బును వెచ్చించడం అభినందనీయమని అన్నారు. పిల్లల సంక్షేమం కోసం తన సొంత డబ్బును ఖర్చు చేసి తాత్కాలిక వసతి ఏర్పాటు చేసిన టీచర్ ను హృదయపూర్వకంగా అభినందిస్తున్నానని మంత్రి పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం గత రెండున్నరేళ్లుగా విద్య, వైద్య రంగాలను అత్యంత ప్రాధాన్యతా రంగాలుగా భావించి పనిచేస్తోందని మంత్రి అన్నారు. విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించేందుకు ప్రత్యేకంగా దృష్టి సారించామని, స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. యువత ఉద్యోగాల కోసం ఎదురుచూసే వారిగా కాకుండా, ఉద్యోగాలు కల్పించే పారిశ్రామిక వేత్తలుగా ఎదిగేందుకు అవసరమైన శిక్షణ అందిస్తున్నామని చెప్పారు.

రాష్ట్రంలోని అన్ని ఐటీఐలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్‌ (ATC)లుగా అప్‌గ్రేడ్ చేస్తున్నామని, ప్రతి అసెంబ్లీ నియోజక వర్గంలో ఒక ఏటిసి ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఆయా కేంద్రాల ద్వారా యువతకు ఆధునిక నైపుణ్యాలతో కూడిన కోర్సుల్లో శిక్షణ అందించి, ఉపాధి అవకాశాలు పొందడంతో పాటు ఇతరులకు ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఏటిసి లను దూరదృష్టితో ఏర్పాటు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.

తిరుమలాయపాలెం మండలంలో వైద్య రంగానికి కూడా ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి అన్నారు. పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, కొత్త ఆసుపత్రుల నిర్మాణంతో పాటు ఆసుపత్రుల్లో వైద్యులు, మందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు.

రైతు సంక్షేమానికి ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటోందని మంత్రి అన్నారు. గత రెండున్నరేళ్లలో మహిళా సంఘాలకు రూ.63 వేల కోట్ల వడ్డీలేని రుణాలు అందించామని తెలిపారు. రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం అందిస్తున్నా మని, కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తున్నా మని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల మొదటి దశలో ఇళ్లను మంజూరు చేశామని, ప్రస్తుతం రెండో దశ ఇళ్లను అందిస్తున్నామని, అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు అందుతుందని స్పష్టం చేశారు.

కొత్త పింఛన్ల మంజూరు కోసం ఆగస్టు 31 వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నామని మంత్రి తెలిపారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ కొత్త పింఛన్ అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు.

*జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ మాట్లాడుతూ* గోపాలపురం పాఠశాల భవనం అత్యంత దెబ్బతిన్న స్థితిలో ఉందని, మరమ్మతులు చేపట్టే అవకాశం లేకపోవడంతో అమ్మ ఆదర్శ పాఠశాల పనుల్లో ఈ పాఠశాలను చేర్చలేదని తెలిపారు. మంత్రి ఆదేశాల మేరకు రూ.30 లక్షలతో రెండు అదనపు తరగతి గదుల నిర్మాణానికి నిధులు మంజూరు చేసి, ప్రస్తుతం శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించామని చెప్పారు.

పాఠశాలలో విద్యార్థుల కోసం టీచర్ సుమారు రూ.30 వేల సొంత నిధులతో తాత్కాలిక షెడ్డు ఏర్పాటు చేశారని కలెక్టర్ తెలిపారు. టీచర్ సేవాభావాన్ని మంత్రి అభినందించారని పేర్కొన్నారు. నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి, మంత్రి చేతుల మీదుగా ప్రారంభోత్సవం నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఏదులాపురం మునిసిపల్ చైర్ పర్సన్ పోకబత్తిని అనిత, పిఆర్ ఎస్ఈ వెంకట్ రెడ్డి, ఆర్ అండ్ బి ఎస్ఈ యుగంధర్ రావు, హౌజింగ్ పిడి భూక్యా శ్రీనివాస్, ఖమ్మం ఆర్డీవో ఎన్. శ్రీనివాస్, తిరుమలాయపాలెం మండల ఎంపీడీవో సిలార్ సాహెబ్, తహశీల్దార్ విల్సన్, ఎర్రగడ్డ గ్రామ పంచాయతీ సర్పంచ్ నల్లమల్ల కీర్తి నీరన్ కుమార్, ప్రజాప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

సోదరభావానికి ప్రతీక రాఖీ పౌర్ణమి. సోదరభావానికి ప్రతీక రాఖీ పౌర్ణమి.
స్వామి వివేకానంద స్కూల్‌లో రాఖి పౌర్ణమి సందర్భంగా విద్యార్థుల సందడి.
అంకితభావానికి ప్రతిరూపం జోజప్ప.
బెల్లంపల్లిలో ఘనంగా మీలాద్ ఉన్ నబీ వేడుకలు..
చెట్లే మానవాళికి జీవనాధారం… రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
గదేపాడులో ఓటర్ల జాబితాపై గ్రామసభ
విద్య, వైద్య రంగాలకు ప్రజా ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత... రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి
పేటలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం