కొనసాగుతున్న 34వ రాష్ట్రస్థాయి త్రోబల్ క్యాంపు..

క్యాంపులో పాల్గొన్న 40 మంది క్రీడాకారులు..

Published On
కొనసాగుతున్న 34వ రాష్ట్రస్థాయి త్రోబల్ క్యాంపు..

 

 

 

 

మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్)

 

రాష్ట్ర స్థాయి త్రోబాల్ క్రీడాకారులను మరింత ప్రతిభావంతులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో నిర్వహిస్తున్న 34వ రాష్ట్ర స్థాయి త్రోబాల్ శిక్షణ శిబిరం కొనసాగుతోంది.వారం రోజుల పాటు క్రీడాకారులకు ఉచిత భోజన వసతి సౌకర్యాలతో పాటు కోచింగ్ క్యాంపు నిర్వహించనున్నట్లు త్రో బాల్ అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పులియాల రవికుమార్,జిల్లా కార్యదర్శి యాదండ్ల బలరాం లు తెలిపారు.ఈనెల 29నుండి నవంబర్ 1వరకు పశ్చిమబెంగాల్ కోల్ కత్తాలో జరిగే జాతీయ పోటీలలో సబ్ జూనియర్ బాలబాలికల జట్లు పాల్గొంటాయని వారు పేర్కొన్నారు.జాతీయస్థాయి లోను క్రీడాకారులు రాణించే విధంగా కోచింగ్ క్యాంపులో నిష్ణాతులైన శిక్షకులచే కోచింగ్ ఇప్పిస్తున్నట్లు వారు తెలిపారు.జాతీయస్థాయిలోను బాలబాలికల రాష్ట్ర జట్లు రాణిస్తాయని వారు దీమా వ్యక్తం చేశారు.రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి సుమారు 40మంది క్రీడాకారులు ఈ శిబిరానికి హాజరై శిక్షణ పొందుతున్నారు.ఈ శిక్షణ శిబిరంలో క్రీడాకారులకు త్రోబాల్ క్రీడలోని మెళకువలు,ఆటలో అనుసరించాల్సిన వ్యూహాలు,శారీరక దృఢత్వం,జట్టు సమన్వయం వంటి అంశాలపై శిక్షణ అందిస్తున్నారు.అనుభవజ్ఞులైన శిక్షకుల మార్గదర్శకత్వంలో క్రీడాకారులు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటున్నారు.రాష్ట్ర స్థాయి శిబిరం క్రీడాకారుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతో పాటు భవిష్యత్తులో ఉన్నత స్థాయి పోటీల్లో రాణించేందుకు దోహదపడనుంది.వివిధ జిల్లాల క్రీడాకారులు ఒకే వేదికపై శిక్షణ పొందడం ద్వారా తమ అనుభవాలను పంచుకునే అవకాశం లభిస్తోంది.క్రీడాకారులు ఈ శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకొని త్రోబాల్ క్రీడలో మరింత ప్రతిభ కనబరిచి రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని రాష్ట్ర క్రీడాభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

Tags:

About The Author

Latest News

కారేపల్లిలో ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు ఉచిత కేంద్రాలు! కారేపల్లిలో ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు ఉచిత కేంద్రాలు!
        కారేపల్లి, అక్టోబర్ 24 (లోకల్ గైడ్ న్యూస్): ఖమ్మం–వరంగల్–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ ఆదేశాల
ప్రతి రైతు తన వ్యవసాయ భూమిలో వ్యవసాయ క్షేత్ర చెరువు నిర్మాణం చేపట్టాలి
థాంగ్‌-టా విజేతలకు కలెక్టర్‌ అభినందన
కొందుర్గు రైతు వేదికలో సబ్సిడీపై శనగ విత్తనాల పంపిణీ...
మామిడిపల్లి లో ఐ ర్ ఐ ఎస్  ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య పరీక్షలు. 
నియోజకవర్గం అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే తన ప్రధాన ఎజెండా -మాజీ మంత్రి, మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే పి. సబితా ఇంద్రా రెడ్డి.                                
మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రిలో అధ్వాన్న పరిస్థితులు.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం – మాజీ మంత్రి సత్యవతి రాథోడ్