- District News
- మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రిలో అధ్వాన్న పరిస్థితులు.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కాంగ్రెస్ ప్రభుత్...
మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రిలో అధ్వాన్న పరిస్థితులు.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం – మాజీ మంత్రి సత్యవతి రాథోడ్
మహబూబాబాద్
మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలు, వైద్య సేవలు, పరిసరాల పరిశుభ్రతను మాజీ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్.మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ నేడు పరిశీలించారు
నిన్న ఆసుపత్రిలోని పీడియాట్రిక్ వార్డులో సీలింగ్ కూలిన ఘటనపై ఆందోళన వ్యక్తం చేసిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ నేడు ఆసుపత్రిని సందర్శించి అక్కడి పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆసుపత్రిలో పరిశుభ్రత లోపించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఘాటుగా స్పందిస్తూ..
“ప్రజలకు మెరుగైన వైద్యం అందించాల్సిన ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇలాంటి పరిస్థితులు నెలకొనడం ఆందోళనకరం అనారోగ్యంతో ఆసుపత్రికి వచ్చే రోగులకు భరోసా కల్పించాల్సింది పోయి, ఆసుపత్రిలోనే భయాందోళనకు గురయ్యే పరిస్థితులు ఎందుకు ఏర్పడుతున్నాయా
చిన్నపిల్లలకు చికిత్స అందించే పీడియాట్రిక్ వార్డులో సీలింగ్ కూలడం, ఆసుపత్రి పరిసరాల్లో పరిశుభ్రత లోపించడం ప్రభుత్వ పర్యవేక్షణపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి
ప్రజల ఆరోగ్యం, రోగుల భద్రత ప్రభుత్వానికి ప్రాధాన్యత కాదా.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలి. సీలింగ్ కూలిన ఘటనపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. ఆసుపత్రిలో పరిశుభ్రతను మెరుగుపరిచి, రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా తక్షణ చర్యలు చేపట్టాలి. ప్రజల ప్రాణాలతో ముడిపడిన వైద్య రంగం విషయంలో నిర్లక్ష్యానికి తావివ్వకూడదు” అని ఆమె డిమాండ్ చేశారు
ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే పేద, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్యం అందించడం ప్రభుత్వ బాధ్యత అని, మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రిలోని సమస్యలను వెంటనే పరిష్కరించి రోగులకు సురక్షితమైన వైద్య వాతావరణం కల్పించాలని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ కోరారు.
