నియోజకవర్గం అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే తన ప్రధాన ఎజెండా -మాజీ మంత్రి, మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే పి. సబితా ఇంద్రా రెడ్డి.                                

జల్‌పల్లి సర్కిల్లోని పలు డివిజన్లలో డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. 

Published On
నియోజకవర్గం అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే తన ప్రధాన ఎజెండా -మాజీ మంత్రి, మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే పి. సబితా ఇంద్రా రెడ్డి.                                

 

  

IMG-20261024-WA0152

 నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సంక్షేమ ధ్యేయంగా అహర్నిశలు కృషి చేస్తున్నట్లు మాజీ మంత్రి, మహేశ్వరం నియోజకవర్గం శాసనసభ్యురాలు పి. సబితా ఇంద్రారెడ్డి అన్నారు. జల్‌పల్లి సర్కిల్లోని పహాడీ షరీఫ్ డివిజన్ల పరిధిలో పలు అభివృద్ధి పనులకు అధికారులు, స్థానిక నాయకులతో శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ మహేశ్వరం నియోజకవర్గంలోని ప్రతి బస్తీ, కాలనీ, గ్రామాల్లో భూగర్భ మురుగునీటి వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నానన్నారు. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో డ్రైనేజీ నిర్మాణ పనులను చేపట్టడం జరిగిందన్నారు. శనివారం జల్‌పల్లి డివిజన్ (65) అదానన్ కాలనీ (మరాఠీ భవన్ సమీపంలో) రూపురేఖలు మార్చే విధంగా నూతన అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పైప్‌లైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. పహాడీ షరీఫ్ డివిజన్ (64):ఉస్మాన్ నగర్, హబీబ్ కాలనీ (కాలిద్దీన్ వలీద్ మసీదు సమీపంలో) ఎదుర్కొంటున్న డ్రైనేజీ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పైప్‌లైన్ పునర్నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమం సందర్బంగా స్థానిక ప్రజలు, మహిళలు సబితమ్మకు ఘన స్వాగతం పలికారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా నిరంతరం శ్రమిస్తున్న తమ ప్రియతమ నాయకురాలికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బి ర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంజాల జనార్ధన్, సూరెడ్డి కృష్ణ రెడ్డి , 64 డివిజన్ మాజీ ఏం పి టి సి,  మైనారిటీ విభాగం అధ్యక్షులు షేక్ అఫ్జల్ , మాజీ కౌసిలర్ శంకర్ ,ఎంజల అర్జున్ ,సయీద్ పటేల్ , హిద్రీస్ తదితర నాయకులు పాల్గొన్నారు. ఎన్నో ఏళ్లుగా ఇబ్బంది పడుతున్న డ్రైనేజీ సమస్య ఇప్పుడు కార్యరూపం దాల్చుతున్నందుకు  కాలనీ వాసులు సబితమ్మ కు ధన్యవాదాలు తెలిపారు.

Tags:

About The Author

Latest News

కారేపల్లిలో ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు ఉచిత కేంద్రాలు! కారేపల్లిలో ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు ఉచిత కేంద్రాలు!
        కారేపల్లి, అక్టోబర్ 24 (లోకల్ గైడ్ న్యూస్): ఖమ్మం–వరంగల్–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ ఆదేశాల
ప్రతి రైతు తన వ్యవసాయ భూమిలో వ్యవసాయ క్షేత్ర చెరువు నిర్మాణం చేపట్టాలి
థాంగ్‌-టా విజేతలకు కలెక్టర్‌ అభినందన
కొందుర్గు రైతు వేదికలో సబ్సిడీపై శనగ విత్తనాల పంపిణీ...
మామిడిపల్లి లో ఐ ర్ ఐ ఎస్  ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య పరీక్షలు. 
నియోజకవర్గం అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే తన ప్రధాన ఎజెండా -మాజీ మంత్రి, మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే పి. సబితా ఇంద్రా రెడ్డి.                                
మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రిలో అధ్వాన్న పరిస్థితులు.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం – మాజీ మంత్రి సత్యవతి రాథోడ్