ప్రతి రైతు తన వ్యవసాయ భూమిలో వ్యవసాయ క్షేత్ర చెరువు నిర్మాణం చేపట్టాలి

నీటి సంరక్షణతో పాటు రైతులకు ఉపాధి కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలి

జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Published On
ప్రతి రైతు తన వ్యవసాయ భూమిలో వ్యవసాయ క్షేత్ర చెరువు నిర్మాణం చేపట్టాలి

 



కామారెడ్డి జిల్లా ప్రతినిధి, (లోకల్ గైడ్)

భిక్కనూరు మండలం పెద్దమల్లారెడ్డి గ్రామంలో VB-G RAM G పథకం కింద కొనసాగుతున్న వ్యక్తిగత వ్యవసాయ క్షేత్ర చెరువు నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి రైతు తన వ్యవసాయ భూమిలో వ్యవసాయ క్షేత్ర చెరువు నిర్మించుకునేలా అధికారులు అవగాహన కల్పించాలని సూచించారు. వర్షపు నీటిని నిల్వ చేసుకోవడం ద్వారా భూగర్భ జలాల పెరుగుదలకు, పంటలకు అవసరమైన సాగునీటి లభ్యతకు వ్యవసాయ క్షేత్ర చెరువులు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. నీటి లభ్యతను పెంచుకోవడంతో పాటు పంటల దిగుబడిని మెరుగుపరుచుకోవడానికి రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
భిక్కనూరు మండలం పెద్దమల్లారెడ్డి గ్రామానికి చెందిన రైతు సింగిని భిక్షపతి తనకున్న రెండు ఎకరాల వ్యవసాయ భూమిలో వ్యవసాయ క్షేత్ర చెరువు నిర్మాణం చేపట్టడాన్ని కలెక్టర్ అభినందించారు. ఇతర రైతులు కూడా ఈ విధంగా ముందుకు రావాలని సూచించారు.
అనంతరం వ్యవసాయ క్షేత్ర చెరువు నిర్మాణ పనుల్లో పాల్గొంటున్న కూలీలతో కలెక్టర్ మాట్లాడి, పనుల పురోగతి, కల్పించిన పని దినాలు, పనులు ప్రారంభించిన తేదీ, కూలీల వేతనాల చెల్లింపుల వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. చెరువు పరిమాణం, లోతు తదితర వివరాలను పరిశీలించారు.
VB-G RAM G పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను పెంపొందించడంతో పాటు నీటి సంరక్షణ పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు. గ్రామ సర్పంచ్‌తో పాటు గ్రామంలోని ఇతర రైతులు కూడా తమ వ్యవసాయ భూముల్లో వ్యవసాయ క్షేత్ర చెరువుల నిర్మాణానికి ముందుకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎన్.వై. గిరి, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ దామోదర్ రెడ్డి, మండల ప్రత్యేక అధికారి శ్రీనివాస్, జిల్లా వ్యవసాయ అధికారి మోహన్ రెడ్డి, ఎంపీడీఓ సవిత రెడ్డి, ఏడీఏ అపర్ణ, గ్రామ సర్పంచ్ సాయాగౌడ్, సహకార సంఘం చైర్మన్ రాజాగౌడ్, మండల అధికారులు, ఉపసర్పంచ్, గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

కారేపల్లిలో ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు ఉచిత కేంద్రాలు! కారేపల్లిలో ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు ఉచిత కేంద్రాలు!
        కారేపల్లి, అక్టోబర్ 24 (లోకల్ గైడ్ న్యూస్): ఖమ్మం–వరంగల్–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ ఆదేశాల
ప్రతి రైతు తన వ్యవసాయ భూమిలో వ్యవసాయ క్షేత్ర చెరువు నిర్మాణం చేపట్టాలి
థాంగ్‌-టా విజేతలకు కలెక్టర్‌ అభినందన
కొందుర్గు రైతు వేదికలో సబ్సిడీపై శనగ విత్తనాల పంపిణీ...
మామిడిపల్లి లో ఐ ర్ ఐ ఎస్  ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య పరీక్షలు. 
నియోజకవర్గం అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే తన ప్రధాన ఎజెండా -మాజీ మంత్రి, మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే పి. సబితా ఇంద్రా రెడ్డి.                                
మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రిలో అధ్వాన్న పరిస్థితులు.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం – మాజీ మంత్రి సత్యవతి రాథోడ్