- District News
- Ranga Reddy
- మామిడిపల్లి లో ఐ ర్ ఐ ఎస్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య పరీక్షలు.
మామిడిపల్లి లో ఐ ర్ ఐ ఎస్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య పరీక్షలు.
మహేశ్వరం అక్టోబర్ 24, ( లోకల్ గైడ్ న్యూస్)
ఉచిత వైద్య శిబిరాలు పేదలకు ఎంతో మేలు చేస్తాయని కాంగ్రెస్ పార్టీ 65వ డివిజన్ ఇంచార్జి లాల్ సతీష్ గౌడ్ అన్నారు. ఐ ర్ ఐ ఎస్ ఆధ్వర్యంలో మామిడి పల్లి జీ హెచ్ ఎం సి వార్డు కార్యాలయంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. వ్యాధి గ్రస్తులకు పరీక్షలు నిర్వహించిన అనంతరం మందులను పంపిణీ చేశారు. ఈ శిబిరంలో పెద్ద ఎత్తున చుట్టు పక్కల కాలనీల వాసులు, గ్రామ ప్రజలు తమ కంటి పరీక్షలు చేయించుకొన్నారు. కళ్ళెం నరేష్ గౌడ్ మాట్లాడుతూ ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులకు అభినందనలు తెలుపుతూ ఇలాంటి కార్యక్రమాలు ప్రజలకు ఎంతగానో ఉపయోగ పడుతాయన్నారు. నిరుపేద కుటుంబాలు ఎంతో లబ్ది పొందుతాయని, ఇలాంటి కార్యక్రమాలు ప్రజలు వినియోగించుకోవాలి కోరారు. ఈ కార్యక్రమంలో
బాలాజీ దేవస్థానం చైర్మన్ తో పాటు లాల్ విజయ్ గౌడ్ మున్సిపల్ సూపర్వైజర్ రాజకుమార్, బిల్ కలెక్టర్ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
