- District News
- Ranga Reddy
- కొందుర్గు రైతు వేదికలో సబ్సిడీపై శనగ విత్తనాల పంపిణీ...
కొందుర్గు రైతు వేదికలో సబ్సిడీపై శనగ విత్తనాల పంపిణీ...
లోటు వర్షపాతం దృశ్య.. ఆరుతడి పంటల సాగుపై రైతులు ప్రత్యేక దృష్టి సారించాలి..
లోకల్ గైడ్ న్యూస్ 24 కొందుర్గ్..
రైతులు రబ్బీ ఆరుతడి పంటల పై ప్రత్యేక దృష్టి సాధించాలని,తక్కువ నీటి వ్యయంతో తక్కువ పంట కాల పరిమితి లాభసాటి పంటలను పండించేందుకు రైతులు శ్రద్ధ. వహించాలనే ఉద్యేష్యముతో ప్రభుత్వం సబ్సిడీపై శనగ పంట విత్తనాలను పంపిణీ కి శ్రీకారం చుట్టింది అందుకు అనుగుణంగా నేడు కొందుర్గ్ మండల కేంద్రంలోని రైతువేదిలో రైతులకు శనగ విత్తనాల పంపిణీని ప్రారంబించారు ,ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన,హాజరైన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కోగురి పురుషోత్తం రెడ్డి,షాద్ నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సులోచన కృష్ణారెడ్డి,రైతులకు అందజేశారు..అనంతరం పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ
ఎల్‌నినో ప్రభావం స్వల్ప వర్షాభావ పరిస్థితులు,నేపథ్యంలో రైతులు ఆరుతడి పంటల సాగుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు
ఎన్‌బీఈజీ 47 రకం శనగ విత్తనాలు 7.5 క్వింటాళ్లు సబ్సిడీపై అందుబాటులో ఉన్నాయని తెలిపారు. క్వింటాలు విత్తనాల అసలు ధర రూ.10 వేలుగా ఉండగా, ప్రభుత్వం 40 శాతం సబ్సిడీతో రూ.6 వేలకే ప్రభుత్వం రైతులకు అందిస్తోందని,ఆసక్తి ఉన్న రైతులు సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించి
,పట్టాదారు పాసుపుస్తకం,ఆధార్ కార్డు సమర్పించి విత్తనాలు పొందాలని సూచించారు. మారుతున్న వాతావరణ పరిస్థితులు వ్యవసాయ రంగంపై ప్రభావం చూపే అవకాశం ఉన్నందున రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నీటి వనరులను సమర్థంగా వినియోగించుకోవడం, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకోవడం,ప్రత్యామ్నాయ సాగు విధానాలను అనుసరించడం ద్వారా నష్టాలనుతగ్గించుకోవచ్చని . వ్యవసాయ శాఖ అధికారుల సూచనల మేరకు పంటల సాగుపై నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కొందుర్గ్ సర్పంచ్ ప్రభాకర్, టేకులపల్లి సర్పంచ్ శ్రీశైలం, గ్రామ అధ్యక్షుడు కడిగాళ్ల మహేందర్, మాజీ ఎంపీటీసీ సభ్యుడు మల్లేష్ గౌడ్, పీఏసీఎస్ డైరెక్టర్ భీమారం మనయ్య, జీబీ కృష్ణ, బోరిగా నరేందర్, దుర్గాని శ్రీను, తీగలపల్లి గోపాల్, రాజేందర్ గౌడ్, రామచంద్ర రెడ్డి, కళ్యాణ్ రెడ్డి, శ్రీను, రమేష్, నర్సింలు, సల్వారెడ్డితో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు..
