తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ.

మహిళలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలి.

తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
Published On
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ.

 






నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి. లోకల్ గైడ్.


సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా ఆడపడుచులందరికీ తెలంగాణ శాసన మండలి చైర్మన్  గుత్తా సుఖేందర్ రెడ్డి  హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ "తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు, ఆడపడుచుల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ మన రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చిందని తెలిపారు. ప్రకృతిని ఆరాధిస్తూ, పూలను పూజించే గొప్ప సంప్రదాయం తెలంగాణ బతుకమ్మ పండుగ ప్రత్యేకత అని పేర్కొన్నారు. తొమ్మిది రోజుల పాటు మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, ఆటపాటలతో ఆనందోత్సాహాల మధ్య జరుపుకునే ఈ పండుగ తెలంగాణ ప్రజల ఐక్యతకు, సోదరభావానికి నిదర్శనమని అన్నారు.తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ పండుగ ప్రజలను ఏకతాటిపైకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిందని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి చాటిచెప్పిన ఘనత బతుకమ్మ పండుగకు దక్కుతుందని తెలిపారు.బతుకమ్మ పండుగ కేవలం ఒక వేడుక మాత్రమే కాదని, తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి, ప్రకృతితో మనకున్న అనుబంధానికి ప్రతీక అని పేర్కొన్నారు. మన పండుగలు, సంప్రదాయాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. బతుకమ్మ పండుగ ద్వారా మహిళల మధ్య ప్రేమానురాగాలు, కుటుంబాల మధ్య అనుబంధాలు మరింత బలపడాలని ఆకాంక్షించారు.రాష్ట్రంలోని ప్రతి కుటుంబంలో సుఖశాంతులు, సిరిసంపదలు వెల్లివిరియాలని, మహిళలందరూ ఆయురారోగ్యాలతో, ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నట్లు తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి  తెలిపారు.

Tags:

About The Author

Latest News