మున్సిపాలిటీలో 1వ వార్డు అభివృద్ధి పనుల్లో 1వ ర్యాంక్

చెత్త కాలువల శుభ్రత.. నీటి పైప్‌లైన్‌ లీకేజీలకు తక్షణ మరమ్మతులు

Published On
మున్సిపాలిటీలో 1వ వార్డు అభివృద్ధి పనుల్లో 1వ ర్యాంక్

 

 

 ఖమ్మం జిల్లా ప్రతినిధి ఆగస్టు 14: లోకల్ గైడ్:

వైరా మున్సిపాలిటీ 1వ వార్డులో పారిశుధ్యం, మౌలిక వసతుల మెరుగుదలకు సంబంధించిన పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. కౌన్సిలర్ మోరు శ్రీకాంత్ IMG-20260814-WA0082ఆధ్వర్యంలో చెత్త కాలువల శుభ్రత, నీటి పైప్‌లైన్‌ లీకేజీల మరమ్మతు పనులను ప్రాధాన్యతగా చేపడుతున్నారు.
వార్డులోని ప్రధాన రహదారులతో పాటు వివిధ గల్లీల్లో పేరుకుపోయిన చెత్తను తొలగిస్తూ, మురుగునీటి కాలువలను శుభ్రం చేస్తున్నారు. మూసుకుపోయిన కాలువలను తెరిచి మురుగునీరు సజావుగా ప్రవహించేలా చర్యలు తీసుకుంటున్నారు. దీంతో వర్షాలు, మురుగునీటి నిల్వల కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తగ్గించేలా అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనులు చేపడుతున్నారు.
అదేవిధంగా వార్డులో ఎక్కడైనా నీటి పైప్‌లైన్‌ లీకేజీలు గుర్తించిన వెంటనే మరమ్మతులు చేపట్టి తాగునీటి వృథాను అరికడుతున్నారు. సమస్యలను గుర్తించిన వెంటనే స్పందిస్తూ ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కౌన్సిలర్ మోరు శ్రీకాంత్ తెలిపారు.
“1వ వార్డు సమగ్ర అభివృద్ధే నా ప్రధాన లక్ష్యం. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అవసరమైన పనులను ప్రాధాన్యత క్రమంలో చేపడుతున్నాం. ప్రజల సహకారంతో వార్డును మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తాం” అని కౌన్సిలర్ శ్రీకాంత్ పేర్కొన్నారు.
పారిశుధ్య పనులు, పైప్‌లైన్‌ లీకేజీల మరమ్మతులతో వార్డులో పరిశుభ్రమైన వాతావరణం ఏర్పడటంతో పాటు ప్రజలకు మౌలిక సదుపాయాలు మరింత మెరుగుపడుతున్నాయని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Tags:

About The Author

Latest News

కారేపల్లి మండలంలో కోతుల బెడద.. సర్పంచ్‌లకు పట్టింపేదీ? కారేపల్లి మండలంలో కోతుల బెడద.. సర్పంచ్‌లకు పట్టింపేదీ?
        ఖమ్మం జిల్లా, కారేపల్లి (సింగరేణి ) : లోకల్ గైడ్, ఆగస్టు 14 : కారేపల్లి మండలంలోని పలు గ్రామాల్లో కోతుల బెడద రోజురోజుకూ పెరుగుతూ
బిజెపి విద్వేశ వైఖరి దేశానికి ప్రమాదకరం.
మున్సిపాలిటీలో 1వ వార్డు అభివృద్ధి పనుల్లో 1వ ర్యాంక్
ఆలయ పాలకవర్గ సభ్యులు నిజాయితీగా పని చేయాలి.
స్నేహితుల మధ్య ఘర్షణ.. యువకుడు మృతి
వీధి దీపాల సమస్యలను పరిష్కరించాలి 
ఖమ్మం జిల్లా సత్తుపల్లి లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలను