మహిళ సాధికారతకు ప్రభుత్వం పెద్దపేట

వర్ధన్నపేట ఎమ్మెల్యే కె ఆర్ నాగరాజు

Published On
మహిళ సాధికారతకు ప్రభుత్వం పెద్దపేట

హనుమకొండ జిల్లా ప్రతినిధి,ఆగస్టు13
(లోకల్ గైడ్ న్యూస్)*:

హనుమకొండ,మహిళ సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తుంది అని వర్ధన్నపేట ఎమ్మెల్యే కె ఆర్ నాగరాజు అన్నారు. గురువారం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 1 వ డివిజన్ లో మెప్మా ఆధ్వర్యంలో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మహిళలకు చీరలు పంపిణి చేశారు. అనంతరం ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించామని తెలిపారు. మహిళలను కోటీశ్వరులు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.గత ప్రభుత్వం అందించిన బతుకమ్మ చీరల్లో నాణ్యత లోపం ఉండడంతో ఆడపడుచులు వాటిని ఉపయోగించలేకపోయారనీ, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం మంచి నాణ్యతతో కూడిన, ఉపయోగపడే చీరలను తయారు చేయించి మహిళలకు అందిస్తుందన్నారు.రేవంత్ రెడ్డి ప్రభుత్వం మహిళల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ నాణ్యతతో కూడిన కానుకను అందజేస్తుందన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు.మహిళలు అభివృద్ధి చెందితే అభివృద్ధి చెందుతుంది అన్నారు. మధ్యలో చదువు ఆఫీస్ మహిళలు ఓపెన్ టెన్త్ ద్వారా చదువు కొనసాగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మెప్మా టిఎంసి వెంకట్ రెడ్డి, ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ సదానందం, 1 డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాము, 56వ డివిజన్ అధ్యక్షుడు కొంక హరిబాబు, 55వ డివిజన్ అధ్యక్షుడు శివరాం ప్రసాద్, 66వ డివిజన్ అధ్యక్షుడు కిరణ్, సీనియర్ నాయకులు వీసం సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 వేదికపై మహిళా ప్రాధాన్యత ఏది..

 గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఒకటో డివిజన్లో ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా మహిళలకు చీరాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజు పాల్గొన్నారు. ఈ కార్యక్రమ వేదికపై మహిళలకు అవకాశం కల్పించకపోవడం పలు విమర్శలకు తావిస్తున్నది. ఒక్క మహిళను కూడా వేదికపై కూర్చోబెట్టకుండా మహిళా సాధికారత ఎట్లా సాధ్యం అని పలువురు మహిళలు గుసగుసలాడుకున్నారు. అధికారిక కార్యక్రమంలో అనధికార వ్యక్తులైన పార్టీ నాయకులను కూర్చోబెట్టి మహిళలకు ఒక్క సీటు కేటాయించకపోవడం పట్ల పలు విమర్శలు వినిపిస్తున్నాయి.

Tags:

About The Author

Latest News

సోదరభావానికి ప్రతీక రాఖీ పౌర్ణమి. సోదరభావానికి ప్రతీక రాఖీ పౌర్ణమి.
స్వామి వివేకానంద స్కూల్‌లో రాఖి పౌర్ణమి సందర్భంగా విద్యార్థుల సందడి.
అంకితభావానికి ప్రతిరూపం జోజప్ప.
బెల్లంపల్లిలో ఘనంగా మీలాద్ ఉన్ నబీ వేడుకలు..
చెట్లే మానవాళికి జీవనాధారం… రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
గదేపాడులో ఓటర్ల జాబితాపై గ్రామసభ
విద్య, వైద్య రంగాలకు ప్రజా ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత... రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి
పేటలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం