- District News
- ప్రైవేట్ పాఠశాలల సంఘం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం.
ప్రైవేట్ పాఠశాలల సంఘం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం.
విద్యారంగ సమస్యల పరిష్కారానికి సమష్టి కృషి: - నూతన అధ్యక్షుడు ప్రశాంత్‌కుమార్
లోకల్ గైడ్ /తాండూరు:
తాండూరు ప్రైవేట్ గుర్తింపు పొందిన పాఠశాలల సంఘం (టీపీఆర్ఎస్ఏ) నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం శనివారం పట్టణంలోని సాయిమేధా స్కూల్లో ఘనంగా జరిగింది. అధ్యక్షుడిగా గంజిపల్లి ప్రశాంత్‌కుమార్, ప్రధాన కార్యదర్శిగా ద్యావరి జయవర్ధన్‌రెడ్డి, కోశాధికారిగా అబ్దుల్ సలీం బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా డా. భాస్కర యోగి మాట్లాడుతూ... విద్యార్థుల సామర్థ్యం, అవసరాలను గుర్తించి బోధనా పద్ధతులను అనుసరించాలని సూచించారు. అనంతరం ఆయనను సంఘం ఆధ్వర్యంలో సన్మానించారు.
నూతన అధ్యక్షుడు ప్రశాంత్‌కుమార్ మాట్లాడుతూ... తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన పాఠశాలల యాజమాన్యాలకు కృతజ్ఞతలు తెలిపారు. పదవిని హోదాగా కాకుండా సేవ చేసే అవకాశంగా భావిస్తున్నానని, ప్రైవేట్ పాఠశాలల సమస్యల పరిష్కారానికి సమష్టిగా కృషి చేస్తామని అన్నారు. అనంతరం నూతన కార్యవర్గ సభ్యులు, ఉపాధ్యాయులను సన్మానించారు. కార్యక్రమంలో 450 మందికి పైగా పాఠశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
