- District News
- Nalgonda
- రైట్ టు ఇన్ఫర్మేషన్ సర్వీస్ సొసైటీ నల్గొండ జిల్లా అధ్యక్షుడిగా కలకుంట్ల వినోద్ కుమార్ నియామకం .
రైట్ టు ఇన్ఫర్మేషన్ సర్వీస్ సొసైటీ నల్గొండ జిల్లా అధ్యక్షుడిగా కలకుంట్ల వినోద్ కుమార్ నియామకం .
నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి. లోకల్ గైడ్.
రైట్ టు ఇన్ఫర్మేషన్ సర్వీస్ సొసైటీ,సమాచార హక్కు సేవా సొసైటీ నల్గొండ జిల్లా అధ్యక్షుడిగా అనుముల మండలం, పులిమామిడి గ్రామానికి చెందిన కలకుంట్ల వినోద్ కుమార్ నియమితులయ్యారు .ఈ మేరకు సంస్థ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు కె. బాబు రామ్ నాయక్ నియామక పత్రాన్ని జారీ చేశారు.
వినోద్ కుమార్ సమాజ సేవ పట్ల కనబరుస్తున్న అంకితభావం, నాయకత్వ లక్షణాలను గుర్తించి ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించినట్లు బాబు రామ్ నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా సమాచార హక్కు చట్టం–2005 పై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని, ప్రజా సమస్యల పరిష్కారానికి మరియు అవినీతి నిర్మూలనకు సంస్థ పరంగా కృషి చేయాలని సూచించారు.తనపై నమ్మకంతో జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించినందుకు కలకుంట్ల వినోద్ కుమార్ సొసైటీ జాతీయ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.సంస్థ ఆశయాలకు అనుగుణంగా ప్రజల హక్కుల పరిరక్షణకు శక్తివంచన లేకుండా పనిచేస్తానని ఆయన పేర్కొన్నారు.
