సమ్మక్క–సారలమ్మ, నాగులమ్మ ఆలయ నిర్మాణానికి ప్రభుత్వ భూమి కేటాయించాలి

Published On
సమ్మక్క–సారలమ్మ, నాగులమ్మ ఆలయ నిర్మాణానికి ప్రభుత్వ భూమి కేటాయించాలి

 

చర్ల : లోకల్ గైడ్ న్యూస్ :

 చర్ల మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆర్.కొత్తగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని దానవాయిపేట గ్రామస్తులు తమ సమస్యపై అధికారులకు వినతిపత్రం సమర్పించారు. గ్రామంలో కొలువై ఉన్న వనదేవతలు శ్రీ సమ్మక్క–సారలమ్మ, నాగులమ్మ దేవతలకు సుమారు 20 ఏళ్లుగా ప్రతి రెండేళ్లకోసారి జాతర నిర్వహిస్తున్నామని గ్రామస్తులు తెలిపారు. జాతరకు మారుమూల ప్రాంతాల నుంచి వందలాది మంది భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారని, ప్రస్తుతం ఉన్న స్థలం సరిపోవడం లేదని పేర్కొన్నారు. గిరిజన సంప్రదాయాలు, సంస్కృతి, ఆచారాలను గౌరవిస్తూ భవిష్యత్తులో జాతరను మరింత ఘనంగా నిర్వహించేందుకు ఆర్.కొత్తగూడెం పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ భూమిని సమ్మక్క–సారలమ్మ, నాగులమ్మ దేవతల గద్దెలు, ఆలయ నిర్మాణానికి కేటాయించాలని కోరారు.‌ ఈ మేరకు చర్ల మండల రెవెన్యూ అధికారి, మండల పరిషత్ అభివృద్ధి అధికారి, ప్రజావాణి అధికారులకు వినతిపత్రం అందజేశారు. అధికారులు ప్రభుత్వ భూమిని పరిశీలించి, ఆలయ నిర్మాణానికి అనుకూలమైన స్థలాన్ని కేటాయించాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. గ్రామస్తులకు మద్దతుగా ఆర్.కొత్తగూడెం సర్పంచ్ తుర్రం రవికుమార్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఇర్ప శ్రీనివాసరావు పాల్గొన్నారు. కార్యక్రమంలో దానవాయిపేట రూంజా రాజా, వార్డు సభ్యురాలు కణితి రజిని, కారం మహి, పాయం ప్రియ, నూప లక్ష్మి, నూప గంగమ్మ, కుంజ జోగమ్మ, కారం గంగమ్మ, రూప రాజమ్మ, పోడియం అక్కమ్మ, కొరస నాగమణి, సోయం ముత్యాల అక్క, సవలం సావిత్రి, మల్లం సుశీల, నాగమణి, సమ్మక్క, శ్యామల, కాక లక్ష్మి, నరసమ్మ, నూపా రమ్య, కారం కావ్య, ఇర్ప అన్నపూర్ణ, రమాదేవి, పాయం గీత, నూపా సీతారామయ్య, నాగేశ్వరావు, కారం లక్ష్మణ్తో పాటు దానవాయిపేట గ్రామ మహిళలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

ప్రైవేట్ పాఠశాలల సంఘం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం. ప్రైవేట్ పాఠశాలల సంఘం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం.
లోకల్ గైడ్ /తాండూరు:తాండూరు ప్రైవేట్ గుర్తింపు పొందిన పాఠశాలల సంఘం (టీపీఆర్ఎస్ఏ) నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం శనివారం పట్టణంలోని సాయిమేధా స్కూల్లో ఘనంగా జరిగింది....
రైట్ టు ఇన్ఫర్మేషన్ సర్వీస్ సొసైటీ నల్గొండ జిల్లా అధ్యక్షుడిగా కల‌కుంట్ల వినోద్ కుమార్ నియామకం .
ఇఫ్తికార్ అహ్మద్‌ను పరామర్శించిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి.
ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు సమర్పించిన  దరఖాస్తులను నిర్ణీత గడువులో పరిష్కరించాలి : సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్ట
శంషాబాద్ సిద్ధేశ్వర్ కాలనీలో విషాదం: మనస్తాపంతో 19 ఏళ్ల యువతి ఆత్మహత్య.
రేబిస్ నివారణపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలి... జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్రే బిస్ నివారణకు వ్యాక్సినేషన్‌నే ప్రధాన మార్గం
సమ్మక్క–సారలమ్మ, నాగులమ్మ ఆలయ నిర్మాణానికి ప్రభుత్వ భూమి కేటాయించాలి