పేదల పొట్టపై ధరల పోటు.. ఉపాధి హామీ బలోపేతం చేయాలి

200 రోజుల పని.. రోజుకు రూ.600 కూలీ ఇవ్వాలి: వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కొండబోయిన నాగేశ్వరరావు

Published On
పేదల పొట్టపై ధరల పోటు.. ఉపాధి హామీ బలోపేతం చేయాలి

 

 

కారేపల్లి (సింగరేణి), సెప్టెంబర్ 17 (లోకల్ గైడ్ న్యూస్) : నిత్యావసర సరుకుల ధరలు రోజురోజుకూ పెరుగుతూ పేదల జీవనంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని, ధరల భారాన్ని నియంత్రించడంతో పాటు గ్రామీణ పేదలకు ఉపాధి భరోసా కల్పించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కొండబోయిన నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. గురువారం బొక్కలతండలో జరిగిన వ్యవసాయ కార్మికుల జనరల్ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ధరల పెరుగుదలతో పేద, మధ్యతరగతి కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని అన్నారు. చౌకధరల దుకాణాల ద్వారా బియ్యంతో పాటు నూనె, పప్పులు, పంచదార, చింతపండు, గోధుమలు తదితర నిత్యావసర సరుకులను అందించాలని కోరారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా వ్యవసాయ పనులు తగ్గి కూలీలకు ఉపాధి అవకాశాలు కరువయ్యాయని నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకాన్ని పటిష్టంగా అమలు చేసి ప్రతి పేద కుటుంబానికి 200 రోజుల పని, కొలతలతో సంబంధం లేకుండా రోజుకు రూ.600 కూలీ కల్పించాలని డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో పనులు పెంచి పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించాలని కోరారు.ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన సంక్షేమ హామీలను అమలు చేయాలని, మహిళలకు రూ.2,500, భూమిలేని పేదలకు వార్షిక ఆర్థిక సాయం, ఆసరా పెన్షన్ల పెంపు, కొత్త పెన్షన్ల మంజూరు వంటి హామీలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో సంక్షేమ పథకాలకు అవసరమైన నిధులు కేటాయించాలని కోరారు.ఈ కార్యక్రమంలో షేక్ సైదులు మేస్త్రి, బానోత్ శ్రీను, మాలోత్ బాలు, అజ్మీర వినోద్ కుమార్, బావుసింగ్, రాములు, వీరన్న, సక్కుబాయి, సరోజిని, దేవి, శారద, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

పేదల పొట్టపై ధరల పోటు.. ఉపాధి హామీ బలోపేతం చేయాలి పేదల పొట్టపై ధరల పోటు.. ఉపాధి హామీ బలోపేతం చేయాలి
        కారేపల్లి (సింగరేణి), సెప్టెంబర్ 17 (లోకల్ గైడ్ న్యూస్) : నిత్యావసర సరుకుల ధరలు రోజురోజుకూ పెరుగుతూ పేదల జీవనంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని, ధరల
బియ్యంతో శ్రీ వెంకటేశ్వర స్వామి రూపంలో గణనాథుడి ప్రతిష్ట 
అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తెలంగాణ… రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
కిలారి సుశీలకు నివాళి
చిరుమర్రి చెరువు వద్ద రూ. 2.90 కోట్లతో పర్యాటక వసతుల అభివృద్ధి
సెప్టెంబర్‌ 17.. పోరాట చరిత్రకు మైలురాయి
ప్రభుత్వ, వైద్య కళాశాల సీట్లు సాధించిన పూర్వ విద్యార్థులకు ఘన సన్మానం