ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు సమర్పించిన  దరఖాస్తులను నిర్ణీత గడువులో పరిష్కరించాలి : సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్ట

Published On
ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు సమర్పించిన  దరఖాస్తులను నిర్ణీత గడువులో పరిష్కరించాలి : సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్ట

 

భద్రాచలం : లోకల్ గైడ్ న్యూస్ :

ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు సమర్పించిన దరఖాస్తులను సంబంధిత అధికారులు పరిశీలించి నిర్ణీత గడువులో పరిష్కరించాలని భద్రాచలం సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్ట ఆదేశించారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా ప్రజావాణిలో అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలోని తన చాంబర్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ శాఖల అధికారుల సమక్షంలో ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. అనంతరం దరఖాస్తులను సంబంధిత అధికారులకు పంపిస్తూ అర్హులైన వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజావాణిలో ప్రధానంగా రెవెన్యూ, భూ సమస్యలు, పింఛన్లు, వివిధ సంక్షేమ పథకాలు, నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు, వ్యక్తిగత సమస్యలపై ప్రజలు అర్జీలు సమర్పించినట్లు తెలిపారు. స్వీకరించిన దరఖాస్తులను ఆన్‌లైన్‌లో నమోదు చేసి సంబంధిత డివిజన్ అధికారులకు పంపించినట్లు పేర్కొన్నారు. ప్రతి ఫిర్యాదుపై సంబంధిత శాఖాధిపతులు వ్యక్తిగతంగా పర్యవేక్షణ చేపట్టి, నిర్ణీత గడువులో సమస్య పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టర్ ఆదేశించారు. దరఖాస్తులు పెండింగ్‌లో లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎల్‌పీఓ సుధీర్, డీఏఓ భగవాన్ రెడ్డి, భద్రాచలం డివిజన్ పరిధిలోని వివిధ శాఖల డివిజనల్ స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

ప్రైవేట్ పాఠశాలల సంఘం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం. ప్రైవేట్ పాఠశాలల సంఘం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం.
లోకల్ గైడ్ /తాండూరు:తాండూరు ప్రైవేట్ గుర్తింపు పొందిన పాఠశాలల సంఘం (టీపీఆర్ఎస్ఏ) నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం శనివారం పట్టణంలోని సాయిమేధా స్కూల్లో ఘనంగా జరిగింది....
రైట్ టు ఇన్ఫర్మేషన్ సర్వీస్ సొసైటీ నల్గొండ జిల్లా అధ్యక్షుడిగా కల‌కుంట్ల వినోద్ కుమార్ నియామకం .
ఇఫ్తికార్ అహ్మద్‌ను పరామర్శించిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి.
ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు సమర్పించిన  దరఖాస్తులను నిర్ణీత గడువులో పరిష్కరించాలి : సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్ట
శంషాబాద్ సిద్ధేశ్వర్ కాలనీలో విషాదం: మనస్తాపంతో 19 ఏళ్ల యువతి ఆత్మహత్య.
రేబిస్ నివారణపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలి... జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్రే బిస్ నివారణకు వ్యాక్సినేషన్‌నే ప్రధాన మార్గం
సమ్మక్క–సారలమ్మ, నాగులమ్మ ఆలయ నిర్మాణానికి ప్రభుత్వ భూమి కేటాయించాలి