- District News
- Ranga Reddy
- ఫ్యూచర్ సిటీ’ని అడ్డుకుంటే ప్రజాక్షేత్రంలో అడ్రస్ గల్లంతే ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి
ఫ్యూచర్ సిటీ’ని అడ్డుకుంటే ప్రజాక్షేత్రంలో అడ్రస్ గల్లంతే ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి
పదేళ్ల పాలనలో చేసింది శూన్యం.. మళ్లీ అవాకులు చెవాకులా? యాచారం రూపురేఖలు మారుస్తాం.. నిధుల వరద పారిస్తాం
నష్టపోయిన ప్రతి రైతుకూ న్యాయం.. అసైన్డ్ భూములకూ మార్కెట్ పరిహారం.
పలు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి అభివృద్ధి పనులకు శంకుస్థాపన.
Published On
By Ram Reddy
ఇబ్రహీంపట్నం/యాచారం సెప్టెంబర్ 30( లోకల్ గైడ్ )
బుధవారం యాచారం మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. అనంతరం యాచారం, మొండిగౌరెల్లి, తక్కళ్లపల్లి, కొత్తపల్లి, ధర్మన్నగూడ తదితర గ్రామాల్లో సుడిగాలి పర్యటన చేపట్టారు. సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, పాఠశాలల్లో అదనపు తరగతి గదుల నిర్మాణంతో పాటు పలు ప్రగతి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. పర్యటన సందర్భంగా యాచారం, మొండిగౌరెల్లి గ్రామాల్లో మహిళలు ఆయనకు మంగళహారతులు, పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు.
కొత్తపల్లి గ్రామంలో స్థానికులనుద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఏళ్ల తరబడి అభివృద్ధికి నోచుకోని గ్రామాలను అన్ని రంగాల్లో తీర్చిదిద్దుతామన్నారు. భూసేకరణలో భూములు కోల్పోయిన ప్రతి ఒక్క రైతుకూ అండగా ఉంటామని, ముఖ్యంగా అసైన్డ్ భూముల రైతులకు సైతం మార్కెట్ విలువ ప్రకారం నష్టపరిహారం అందేలా చూస్తామని స్పష్టం చేశారు.
అలాగే ధర్మన్నగూడలో దశాబ్దాలుగా సరైన రోడ్డు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, గత పాలకులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోలేదని గ్రామస్థులు ఎమ్మెల్యే వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై తక్షణమే స్పందించిన ఆయన, యుద్ధప్రాతిపదికన బీటీ రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజల రవాణా కష్టాలు తీరుస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కంబాలపల్లి గురునాథ్ రెడ్డి,స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ శ్రేణులు భారీగా పాల్గొన్నారు.
Tags:
About The Author
Related Posts
Latest News
12 Oct 2026 21:05:03
కారేపల్లి, అక్టోబర్ 12 (లోకల్ గైడ్ న్యూస్):
దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారిపై భక్తిని చాటుకుంటూ గోవిందుతండాకు చెందిన బానోత్ లచ్చిరామ్–బుజ్జి దంపతులు, వారి
