విద్యార్థులకు సరిపడా బస్సు సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు

Published On
విద్యార్థులకు సరిపడా బస్సు సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు

 


గండిపేట్, అక్టోబర్ 01 (లోకల్ గైడ్):

విద్యార్థులు, సామాన్య ప్రజలకు సరిపడా ఆర్టీసీ బస్సు సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు హరీష్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు.
రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని 123వ డివిజన్ సన్‌సిటీ పరిసర ప్రాంతాల్లో రోజురోజుకూ జనాభా పెరుగుతుండటంతో పాటు ట్రాఫిక్ రద్దీ కూడా అధికమవుతోందని ఆయన తెలిపారు. ముఖ్యంగా ప్రతి రోజు ఉదయం పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు బస్సుల కొరత కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.IMG-20261001-WA0152
సన్‌సిటీ ప్రాంతం నుంచి టీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో కళాశాలలకు వెళ్లే విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా బస్సులు లేకపోవడంతో కిక్కిరిసిన బస్సుల్లో ప్రయాణించాల్సి వస్తోందన్నారు. కొందరు విద్యార్థులు ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణించాల్సి వస్తోందని, దీనివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఉదయం వేళల్లో అదనపు బస్సులను ఏర్పాటు చేయాలని ఆర్టీసీ యాజమాన్యాన్ని హరీష్ గౌడ్ కోరారు. ప్రమాదాలు సంభవించిన తర్వాత చర్యలు తీసుకోవడం కంటే ముందుగానే తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు.
అలాగే సన్‌ సిటీ చౌరస్తా పరిసర ప్రాంతాల్లో వాహనాల రద్దీ కారణంగా తరచూ ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోందని, ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

Tags:

About The Author

Latest News

ఎన్కతల లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ఎన్కతల లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
    మోమిన్‌పేట్, సెప్టెంబర్ 01 ( లోకల్ గైడ్ వికారాబాద్ జిల్లా బ్యూరో : మండల పరిధిలోని ఎన్కతల గ్రామంలో అర్హులైన పేదలందరికీ త్వరలోనే స్మార్ట్ రేషన్
ఫోన్ మోజులో వైద్యుల నిర్లక్ష్యం ప్రభుత్వ ఆసుపత్రుల్లో పసిపాపల ప్రాణాలతో చెలగాటం
ఆమనగల్లు అభివృద్ధి కోసం ఆచారి ఆమరణ నిరాహార దీక్ష
విద్యార్థులకు సరిపడా బస్సు సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు
ఫతుల్లాగూడ జంతు సంరక్షణ కేంద్రంలో కమిషనర్‌ పరిశీలన ఏబీసీ, యాంటీ రేబిస్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమాలపై సమీక్ష
దళితుల,అభ్యున్నతి,సామాజిక రాజకీయ ,చైతన్యం కాంగ్రెస్ తోనే సాధ్యం.... షాద్ నగర్ నియోజక వర్గంలో ఎస్సీ, ఎస్టీలకు సముచిత స్థానం...
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన