బతుకమ్మ ఆడపడుచులకు చీరల కానుక.. గుడిపూడి తిరుమల రావు ఆప్యాయత!

గేట్ కారేపల్లిలో బతుకమ్మ ఆడిన మహిళలకు చీరల పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకుడు తిరుమల రావు 

Published On
బతుకమ్మ ఆడపడుచులకు చీరల కానుక.. గుడిపూడి తిరుమల రావు ఆప్యాయత!

 

 

కారేపల్లి, అక్టోబర్ 18 (లోకల్ గైడ్ న్యూస్):

సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ సందర్భంగా సింగరేణి మండలం గేట్ కారేపల్లి గ్రామంలో కాంగ్రెస్ నాయకుడు గుడిపూడి తిరుమల రావు బతుకమ్మ ఆడిన ఆడపడుచులందరికీ చీరలు పంపిణీ చేశారు. పండుగ వేళ మహిళలకు చీరలు అందజేసి వారిలో ఆనందోత్సాహాలు నింపారు. ఈ సందర్భంగా గుడిపూడి తిరుమల రావు మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి, ఐక్యతకు, సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అని పేర్కొన్నారు. మహిళలు సంప్రదాయబద్ధంగా బతుకమ్మ వేడుకలను ఆనందంగా జరుపుకోవడం తెలంగాణ సంస్కృతికి నిదర్శనమన్నారు. బతుకమ్మ ఆడిన ఆడపడుచులకు చీరలు అందజేయడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. బతుకమ్మ తల్లి ఆశీస్సులతో ప్రతి కుటుంబం ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. గ్రామ ప్రజలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ కందుల సామేలు, కాంగ్రెస్ నాయకులు చెరుకూరి రామారావు, వరికొల్లు వీరభద్రం, షేక్ హాజిమియా, చెరుకూరి కృష్ణమూర్తి, నూకల మోహనరావు, కంటగాని లింగయ్య, సాయిన్నీ బసవయ్య, సపావత్ అప్పయ్య, వీరయ్య, సామినేని తిరుపతిరావు, కాకటి పృథ్వీ, కంటగాని కిషోర్, మర్రి సాయి, చందనూరి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

గాదెపాడు గ్రామంలోని యాదవ బజారు వద్ద ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి! గాదెపాడు గ్రామంలోని యాదవ బజారు వద్ద ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి!
        కారేపల్లి, అక్టోబర్ 18 (లోకల్ గైడ్ న్యూస్): ఖమ్మం జిల్లా గాదెపాడు గ్రామపంచాయతీ పరిధిలోని యాదవ బజారు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆటోను
గేట్ కారేపల్లి సద్దుల బతుకమ్మ వేడుకల్లో తోటకూరి పిచ్చయ్య దాతృత్వం!
వికారాబాద్ ఆర్టీసీ డిపో ప్రాంగణంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
షాద్ నగర్ బిఆర్ఎస్ పార్టీలో భారీ చేరికలు
రావిర్యాల లో వైభవంగా దుర్గాష్టమి ఉత్సవాలు.
కారేపల్లిలో ఎల్‌నినోపై అలర్ట్‌.. పొదుపు చర్యలకు సర్పంచుల సిద్ధం! రంజిత్ కుమార్ 
బతుకమ్మ ఆడపడుచులకు చీరల కానుక.. గుడిపూడి తిరుమల రావు ఆప్యాయత!