రాజేంద్రనగర్‌లో మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ - స్టాక్‌హోల్డర్స్ కన్సల్టేషన్ సమావేశం. 

Published On
రాజేంద్రనగర్‌లో మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ - స్టాక్‌హోల్డర్స్ కన్సల్టేషన్ సమావేశం. 

 

రాజేంద్ర నగర్, ( లోకల్ గైడ్ ):

రాజేంద్రనగర్ లోని వాలంతరీ లో మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ స్పెషల్ ఆఫీసర్ నరసింహారెడ్డి,  జీహెచ్‌ఎంసీ రాజేంద్ర నగర్ జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి  ఆధ్వర్యంలో మూసీ ప్రాజెక్ట్ నిర్వాసితుల (భూమి / నిర్మాణాల యజమానులు) కొరకు "స్టాక్‌హోల్డర్స్ కన్సల్టేషన్ (సలహా & సంప్రదింపుల)" సమావేశం అత్యంత ప్రశాంతంగా నిర్వహించారు. 
ఈ కీలక సమావేశానికి రాజేంద్రనగర్ శాసనసభ్యులు ప్రకాష్ గౌడ్  ముఖ్య అతిథిగా విచ్చేసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మూసీ పునరుజ్జీవనం, రివర్‌ఫ్రంట్ అభివృద్ధి,  ప్రాజెక్ట్ వల్ల ప్రభావితమయ్యే స్థానిక ప్రజలు, యజమానులకు ప్రభుత్వం తరఫున అందే ప్రయోజనాలు, పునరావాస చర్యలపై అధికారులతో కలిసి చర్చించారు. స్థానిక ప్రజల అభిప్రాయాలను సేకరించి, వారికి భరోసానిచ్చేలా ఈ సమావేశం కొనసాగింది. ఈ కార్యక్రమంలో రాజేంద్రనగర్ డివిజన్ ఆర్డీవో శ్రీధర్,  వివిధ శాఖల అధికారులు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

గంగారం తండా సర్పంచ్ కిరణ్‌కుమార్ ఫిర్యాదుతో కదిలిన హరీశ్‌రావు! గంగారం తండా సర్పంచ్ కిరణ్‌కుమార్ ఫిర్యాదుతో కదిలిన హరీశ్‌రావు!
        కారేపల్లి, నవంబర్ 6 (లోకల్ గైడ్ న్యూస్): సింగరేణి మండలం గంగారం తండా గ్రామపంచాయతీలో ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుల వ్యవహారం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. గ్రామంలో
క్రైస్తవ మహిళలపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి.
డా. బొమ్మరబోయిన కేశవులు ముదిరాజ్ జన్మదినోత్సవం సందర్భంగా రోగులకు అల్పాహార వితరణ.
వెంకటాపురం మండలంలో అక్రమ గుడుంబా తయారీ స్థావరాలపై పోలీసుల మెరుపు దాడులు –  నలుగురు వ్యక్తులపై చట్టపరమైన కేసులు
వికారాబాద్ - శంకర్పల్లి మార్గంలో దట్టమైన పొగమంచు: వాహనదారుల తీవ్ర అవస్థలు
నూతన దంపతులకు బానోత్ సుందర్‌లాల్ ఆత్మీయ ఆశీస్సులు!
సర్పంచ్ సంతకం లేకుండానే ఇందిరమ్మ ఇళ్ల మంజూరా!