గుండె , ఊపిరితిత్తుల వైఫల్యంలో ఎకమో కీలక ప్రాణాధార చికిత్స

ఖమ్మంలో యశోద మెడికల్ సెంటర్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం

Published On
గుండె , ఊపిరితిత్తుల వైఫల్యంలో ఎకమో కీలక ప్రాణాధార చికిత్స

ఖమ్మం, సెప్టెంబర్,3: లోకల్ గైడ్:
ఖమ్మం : తీవ్రమైన గుండె లేదా ఊపిరితిత్తుల వైఫల్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు ఎక్స్ట్రాకార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సిజనేషన్ (ఎకమో) ఒక కీలకమైన అధునాతన ప్రాణాధార చికిత్సగా ఉపయోగపడుతుందని యశోద హాస్పిటల్స్ వైద్యులు తెలిపారు . ఖమ్మంలోని యశోద మెడికల్ సెంటర్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డాక్టర్ డి. మధు కిరణ్ , డాక్టర్ వినీత్ ఇలాపురం , డాక్టర్ బి. అభిషేక్ మాట్లాడుతూ హైదరాబాద్ సోమాజిగూడలోని యశోద హాస్పిటల్స్‌లో అత్యాధునిక వైద్య మౌలిక సదుపాయాలు , అనుభవజ్ఞులైన నిపుణుల బృందం మరియు అధునాతన చికిత్సా విధానాలతో ఎకమో సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు . ఎకమో ఎలా పనిచేస్తుంది ? ఎకమో లో ప్రత్యేకమైన కాన్యులాల ద్వారా రోగి శరీరం నుంచి రక్తాన్ని బయటకు తీసి , ఎకమో సర్క్యూట్‌లోని మెంబ్రేన్ ఆక్సిజినేటర్ ద్వారా రక్తంలోకి ఆక్సిజన్‌ను అందించి , కార్బన్ డయాక్సైడ్‌ను తొలగిస్తారు . అనంతరం ఆక్సిజన్‌తో సమృద్ధిగా ఉన్న రక్తాన్ని తిరిగి రోగి శరీరంలోకి పంపిస్తారు. ఈ విధంగా ఎకమో కొంతకాలం పాటు ఊపిరితిత్తుల పనితీరుకు, అవసరమైన సందర్భాల్లో గుండె పనితీరుకు కూడా మద్దతు అందించే కృత్రిమ జీవనాధార వ్యవస్థగా పనిచేస్తుంది . తీవ్రమైన గుండెపోటు కారణంగా ఏర్పడిన కార్డియోజెనిక్ షాక్ , తీవ్రమైన గుండె వైఫల్యం , తీవ్రమైన శ్వాసకోశ వైఫల్యం ( ఏ ఆర్ డి ఎస్ ) , ఊపిరితిత్తుల వైఫల్యం వంటి ప్రాణాపాయ పరిస్థితుల్లో, ఎంపిక చేసిన రోగులకు ఎకమో ప్రాణాలను నిలబెట్టే వంతెనగా (బ్రిడ్జి థెరపీ) ఉపయోగపడుతుందని వైద్యులు వివరించారు . అలాగే గుండె లేదా ఊపిరితిత్తుల మార్పిడి (ట్రాన్సప్లాంటేషన్) కోసం ఎదురుచూస్తున్న లేదా మార్పిడికి సిద్ధమవుతున్న ఎంపిక చేసిన రోగులకు కూడా ఎకమో కీలకమైన మద్దతును అందించగలదని తెలిపారు . ఎకమో లో ప్రధానంగా వి ఏ - ఎకమో ( వినో - అరటీరియల్ ఎకమో ) మరియు వి వి - ఎకమో ( వినో - వేనౌస్ ఎకమో ) అనే రెండు విధానాలు ఉంటాయి. గుండె పనితీరుకు కూడా మద్దతు అవసరమైన సందర్భాల్లో వి ఏ - ఎకమో ను ప్రధానంగా తీవ్రమైన ఊపిరితిత్తుల వైఫల్యంలో గుండె పనితీరు తగినంతగా ఉన్నప్పుడు వి వి - ఎకమో ను ఉపయోగిస్తామని వైద్యులు తెలిపారు . హైదరాబాద్ సోమాజిగూడ యశోద హాస్పిటల్స్‌లో అత్యంత అనుభవజ్ఞులైన వైద్యులు , సర్జన్లు , క్రిటికల్ కేర్ నిపుణుల సమన్వయంతో పాటు అధునాతన సాంకేతిక పరిజ్ఞానం , కఠినమైన భద్రతా ప్రమాణాలు , వ్యక్తిగతీకరించిన చికిత్సా ప్రణాళిక మరియు సమగ్ర శస్త్రచికిత్సకు ముందు , అనంతర సంరక్షణ అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు . ఈ కార్యక్రమంలో ఏ. శ్రీధర్ రావు, కె. బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

గాజులరామారంలో ‘తెలంగాణ అంకాపూర్ రుచులు’ గ్రాండ్ ఓపెనింగ్ గాజులరామారంలో ‘తెలంగాణ అంకాపూర్ రుచులు’ గ్రాండ్ ఓపెనింగ్
    కుత్బుల్లాపూర్ సెప్టెంబర్ 15 (లోకల్ గైడ్ ప్రతినిధి) హైదరాబాద్: తెలంగాణ సంప్రదాయ వంటకాల ప్రత్యేక రుచులను నగరవాసులకు అందించాలనే ఉద్దేశంతో గాజులరామారం బాలాజీ లేఅవుట్‌లో ‘తెలంగాణ
జాతీయ ఇంజనీర్స్ డే సందర్భంగా ఇంజనీర్లు అందరికీ శుభాకాంక్షలు.
కాంగ్రెస్ సర్కారులో విద్యార్థులకు బంగారు భవిష్యత్తు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పౌష్టికంగా ఉండాలి.
ఆనందోత్సవాల నడుమ వినాయక చవితి వేడుకలు.
జర్నలిస్టుల ఇంటి స్థలాల కోసం ఈనెల 18, 19 తేదీల్లో రిలే నిరాహార దీక్షలు.
హామీల మోసంపై రైతు కూలీల సమరభేరి
శంషాబాద్‌లో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాల ప్రదానం చేసిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్.