- District News
- Ranga Reddy
- గణేష్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలి -
గణేష్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలి -
ఎస్ హెచ్ ఓ శ్రీనివాస్ రెడ్డి.
Published On
By Ram Reddy
గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా, క్రమశిక్షణతో నిర్వహిస్తూ ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని నిర్వాహకులకు సూచించారు. ట్రాఫిక్, శబ్ద నియంత్రణ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, గణేష్ మండపాల వద్ద విద్యుత్, అగ్నిమాపక భద్రతకు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పోలీసు శాఖతో పాటు ఇతర సంబంధిత శాఖలు జారీ చేసే సూచనలు, నిబంధనలను కచ్చితంగా పాటించాలని తెలిపారు. గణేష్ ఉత్సవాలు, నిమజ్జన ఊరేగింపులు ప్రశాంతంగా, సురక్షితంగా జరిగేలా నిర్వాహకులు, ప్రజలు పోలీసులకు పూర్తి సహకారం అందించాలని కోరారు. గణేష్ ఉత్సవాలకు అన్ని ప్రాంతాల్లో తగిన పోలీసు బందోబస్త్ ను ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపారు. ఎక్కడైనా శాంతి భద్రతలకు విఘతం కలిగినట్లయితే సమాచారం అందించాలని అయన సూచించారు.
Tags:
About The Author
Related Posts
Latest News
19 Sep 2026 21:00:53
ముఖ్య అతిధులుగా రాష్ట్ర నేతలు హాజరు
పాత్రికేయులు తరలిరావాలని పిలుపు
