- District News
- పిచ్చి మాటలు మాని అభివృద్ధిపై దృష్టి పెట్టండి. - వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదు.
పిచ్చి మాటలు మాని అభివృద్ధిపై దృష్టి పెట్టండి. - వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదు.
మా నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు
లోకల్ గైడ్/తాండూర్:
పిచ్చి మాటలు మానుకొని తాండూర్ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని బిఆర్ఎస్ కౌన్సిలర్ ఇర్షాద్, యువ నాయకులు సంతోష్ గౌడ్ హితవు పలికారు. శనివారం మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ ఇర్షాద్, సంతోష్‌గౌడ్‌తో పాటు పలువురు నాయకులు మాట్లాడుతూ... రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలకు తావివ్వకుండా ప్రజా సమస్యలు, అభివృద్ధి అంశాలపై దృష్టి పెట్టాలని సూచించారు. తమ నాయకులు రోహిత్ రెడ్డి, రాజు గౌడ్ లపైన అనుచిత వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని, మరోసారి తమ నాయకుల గురించి మాట్లాడితే నాలుక చీరేస్తామని హెచ్చరించారు.
గతంలో రౌడీషీట్ విషయంలో రోహిత్‌రెడ్డి కాళ్లు పట్టుకున్న రోజులను మరిచిపోయారా, పిచ్చి మాటలు మాట్లాడితే సహించేది లేదని వ్యాఖ్యానించారు. ఇకనైనా వ్యక్తిగత విమర్శలను పక్కనపెట్టి తాండూర్ నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు.
ఈ సమావేశంలో కౌన్సిలర్ ఇర్షాద్, సురేష్, సీనియర్ నాయకులు కర్ణాకర్,యువ నాయకులు సంతోష్ గౌడ్,అనిల్, మాజీ కౌన్సిలర్ ఆసిఫ్, నాయకులు రుద్రం పార్టీ, సంజీవ్, తదితరులు పాల్గొన్నారు.
