50 ఏళ్లు నిండిన చేనేత కార్మికులకు పింఛన్ ఇవ్వాలి

షరతులు లేకుండా పింఛన్ దరఖాస్తులు స్వీకరించాలి.. చేనేత సహకార సంఘం ఆమనగల్లు అధ్యక్షులు గాజుల శ్రీనివాస్ 

Published On
50 ఏళ్లు నిండిన చేనేత కార్మికులకు పింఛన్ ఇవ్వాలి

 

లోకల్ గైడ్ ఆమనగల్లు, ఆగస్టు 22:

చేనేత వృత్తినే నమ్ముకుని చిన్ననాటి నుంచి మగ్గం నేస్తూ జీవనం సాగిస్తున్న చేనేత కార్మికులకు 50 సంవత్సరాలు నిండిన వెంటనే వృద్ధాప్య పింఛన్ అందించాలని చేనేత సహకార సంఘం ఆమనగల్లు అధ్యక్షులు గాజుల శ్రీనివాస్, మరి చేనేత సహకార సంఘం సభ్యులు. ప్రభుత్వాన్ని కోరారు. చేనేత కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని పింఛన్ పథకంలో ఉన్న నిబంధనలను సడలించి, అర్హులైన ప్రతి కార్మికుడికి పింఛన్ అందించాలని విజ్ఞప్తి చేశారు.
చేనేత కార్మికులు చాలామంది చిన్న వయసులోనే, సుమారు 12 సంవత్సరాల నుంచే మగ్గం నేస్తూ వృత్తిలో కొనసాగుతున్నారని తెలిపారు. ఏళ్ల తరబడి మగ్గంపై కష్టపడి పనిచేయడం వల్ల 50 సంవత్సరాలకే కంటి చూపు మందగించడం, శారీరకంగా బలహీనపడటం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. అయినప్పటికీ చేనేత వృత్తినే ఆధారంగా చేసుకుని కుటుంబాలను పోషిస్తున్నారని అన్నారు.
గతంలో ముఖ్యమంత్రిగా వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఉన్న సమయంలో గీత కార్మికులు, చేనేత కార్మికులకు 50 సంవత్సరాలు నిండిన వారికి పింఛన్ అందించే విధానం అమలు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం కొత్త పింఛన్ల విషయంలో అనేక మంది చేనేత కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
ప్రస్తుత ప్రభుత్వం చేనేత కార్మికుల కోసం పింఛన్ పథకాన్ని ప్రవేశపెట్టడం సంతోషకరమని, అయితే చేనేత సహకార సంఘంలో సభ్యుడిగా ఉండాలనే నిబంధన వంటి షరతులను తొలగించాలని కోరారు. సహకార సంఘాల్లో సభ్యత్వం లేకపోయినా మగ్గం నేస్తూ జీవిస్తున్న నిజమైన చేనేత కార్మికులను గుర్తించి వారికి కూడా పింఛన్ అందించాలని విజ్ఞప్తి చేశారు.
జాయింట్‌ డైరెక్టర్‌ను కలిసిన చేనేత ప్రతినిధులు
ఈ నెల 21న తెలంగాణ రాష్ట్ర చేనేత ప్రతినిధులు చేనేత జౌళి శాఖ జాయింట్‌ డైరెక్టర్ శ్రీ ఎన్‌.వి. రావును కలిసి చేనేత కార్మికుల సమస్యలను వివరించినట్లు తెలిపారు. చేనేత కార్మికులకు చేనేత చేయూత, చేనేత బీమా పథకాలు అందించాలని, ప్రతి చేనేత కుటుంబానికి సంవత్సరానికి రూ.25 వేల ఆర్థిక సహాయం అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరినట్లు చెప్పారు.
చేనేత రంగాన్ని, వేలాది కుటుంబాల జీవనాధారాన్ని కాపాడేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. 50 సంవత్సరాలు నిండిన ప్రతి అర్హత కలిగిన చేనేత కార్మికుడి నుంచి ఎలాంటి అనవసరమైన షరతులు లేకుండా పింఛన్ దరఖాస్తులు స్వీకరించి, వెంటనే పింఛన్ మంజూరు చేయాలని చేనేత ఐక్యవేదిక రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు, చేనేత సహకార సంఘం అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
“చేనేత కార్మికుల సంక్షేమమే లక్ష్యం.. చేనేతను కాపాడితేనే వేలాది కుటుంబాల జీవనాధారం కాపాడినట్లవు తుంది” అని వారు పేర్కొన్నారు.

Tags:

About The Author

Latest News

మహిళలు ఆర్థికంగా ఎదిగి కోటీశ్వరులవ్వాలి.... పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) మహిళలు ఆర్థికంగా ఎదిగి కోటీశ్వరులవ్వాలి.... పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ధనసరి అనసూయ (సీతక్క)
మహిళా సంఘాలకు అండగా ప్రభుత్వం.. వడ్డీలేని రుణాలు, ఉపాధి అవకాశాలు. సత్తుపల్లిలో ఇందిర మహిళాశక్తి సదస్సు లో పాల్గొని మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ చేసిన మంత్రి...
వైరాలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు
విరాట్ మోటార్స్ నూతన ఓలా షోరూం ఘనంగా ప్రారంభం...
తెలంగాణలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి
శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొన్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తోకల శ్రీనివాస్ రెడ్డి.  
విద్యార్థుల చదువులకు నరసింహారావు–ప్రసన్న లక్ష్మి దంపతుల చేయూత
మిషన్ భగీరథ నీటి సరఫరా లో పంప్ హౌస్ లో సాంకేతిక అంతరాయం