వృద్ధుల పట్ల గౌరవం – సమాజ ప్రగతికి ప్రతీక

- ఆడెపు వేణు, లోక్ అదాలత్ సభ్యులు/న్యాయవాది

Published On
వృద్ధుల పట్ల గౌరవం – సమాజ ప్రగతికి ప్రతీక

 

 

WhatsApp Image 2026-08-21 at 17.52.11

    వృద్ధుల పట్ల గౌరవం – సమాజ ప్రగతికి ప్రతీక అని పేర్కొంటూ, వృద్ధులను భారంగా కాకుండా సమాజానికి విలువైన మార్గదర్శకులుగా చూడాలని లోక్ అదాలత్ సభ్యులు/న్యాయవాది శ్రీ.ఆడెపు వేణు గారు అన్నారు.
 
శుక్రవారం రగుడులోని రంగినేని ట్రస్టులో జిల్లా న్యాయ సేవాధికర సంస్థ అధ్యక్షురాలు, జిల్లా ఇంచార్జి ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి.బి.పుష్పలత గారి ఆదేశాలతో సీనియర్ సివిల్ జడ్జి/కార్యదర్శి, DLSA శ్రీ. పి.లక్ష్మణాచారి గారి సమన్వయంతో ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం ను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వృద్ధుల పట్ల ప్రతి ఒక్కరూ గౌరవం, ప్రేమ, బాధ్యతతో వ్యవహరించాలని అన్నారు.  వృద్ధుల హక్కుల పరిరక్షణకు Maintenance and Welfare of Parents and Senior Citizens Act, 2007 వంటి చట్టపరమైన రక్షణలు అందుబాటులో ఉన్నాయని, తమ హక్కులకు భంగం కలిగినప్పుడు సంబంధిత అధికారులను లేదా న్యాయ సేవా సంస్థలను సంప్రదించి ఉచిత న్యాయ సహాయం పొందవచ్చని అవగాహన కల్పించారు. అనంతరం ట్రస్టులోని వృద్ధులకు న్యాయ సేవాధికర సంస్థ తరపున పండ్లు పంపిణీ చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో న్యాయవాదులు గుర్రం ఆంజనేయులు, బూర మధుసూదన్, రంగినేని ట్రస్టు ప్రిన్సిపల్ వెంకట్రావు, ట్రస్టు ఇంచార్జి తిరుమల్ రెడ్డి, హెడ్ మాస్టర్ Md. అంకుస్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సూపరింటెండ్ లింగంపల్లి మధుసూదన్ రెడ్డి మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

గోదావరి జలాలను త్రాగునీటి అవసరాలకు ప్రాధాన్యతనిస్తూ వినియోగించాలి... జిల్లా కలెక్టర్‌ దివాకర టిఎస్ గోదావరి జలాలను త్రాగునీటి అవసరాలకు ప్రాధాన్యతనిస్తూ వినియోగించాలి... జిల్లా కలెక్టర్‌ దివాకర టిఎస్
*జిల్లాలో ఎక్కడా త్రాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి* కాలువలు, రెగ్యులేటర్లు, చెరువులకు చేరుతున్న నీటి ప్రవాహంపై నిరంతర నిఘా
కల్లుగీత కార్మికుల సుదీర్ఘ పోరాటాల ఫలితమే పాపన్న విగ్రహ ఆవిష్కరణ
వెల్కటూరులో ‘మన పోలీస్ - మన ఊరు’ కార్యక్రమం
వీరభద్ర స్వామి, పోచమ్మ తల్లి ఆశీస్సులతో ..!    
ఖమ్మంలో రైతు కూలీల జాతీయ మహాసభలకు సన్నాహాలు
వృద్ధుల పట్ల గౌరవం – సమాజ ప్రగతికి ప్రతీక
22ఏ నిషేధిత భూములపై సమగ్ర విచారణ జరపాలి