- District News
- టీజీఐఆర్‌డీలో నిర్వహించిన “ఎల్‌నినోను అధిగమించడం–గ్రామీణ ప్రాంతాల్లో ముందస్తు ప్రణాళిక” రాష్ట్రస్థాయ...
టీజీఐఆర్‌డీలో నిర్వహించిన “ఎల్‌నినోను అధిగమించడం–గ్రామీణ ప్రాంతాల్లో ముందస్తు ప్రణాళిక” రాష్ట్రస్థాయి వర్క్‌షాప్‌లో ఇంచర్ల సర్పంచ్ ప్రసంగం
ములుగు జిల్లా లోకల్ గైడ్
హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని టీజీఐఆర్‌డీలో నిర్వహించిన “ఎల్‌నినోను అధిగమించడం–గ్రామీణ ప్రాంతాల్లో ముందస్తు ప్రణాళిక” రాష్ట్రస్థాయి వర్క్‌షాప్‌లో మంత్రులు సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, వాకిటి శ్రీహరితో పాటు ఉన్నతాధికారులు, అదనపు కలెక్టర్లు, జిల్లా అధికారులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ములుగు జిల్లా ఇంచర్ల గ్రామ సర్పంచ్ ముషినేపల్లి కుమార్ గౌడ్ వర్క్‌షాప్‌లో ప్రసంగించారు.
గ్రామాల్లో నీటి సంరక్షణ, వ్యవసాయ చెరువుల నిర్మాణం, గ్రామీణ ఉపాధి కల్పన, వ్యవసాయం–ఉద్యానవనం–పశుసంవర్థక–మత్స్య శాఖల సమన్వయం ద్వారా గ్రామ సమగ్ర అభివృద్ధికి చర్యలు చేపట్టాల్సిన అవసరాన్ని ఆయన వివరించారు.
వర్షాభావ పరిస్థితులను ముందుగానే అంచనా వేసి, రైతులకు నీటి భద్రత కల్పించేలా వ్యవసాయ చెరువులు, నీటి సంరక్షణ పనులకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. వీబీ-జీ రామ్‌జీ ద్వారా గ్రామాల్లో అవసరమైన పనులను ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని కోరారు.
గ్రామ పంచాయతీల ఆర్థిక వనరులను బలోపేతం చేసి, గ్రామ సమగ్ర అభివృద్ధి ప్రణాళికలను సమర్థవంతంగా అమలు చేయాల్సిన అవసరాన్ని సర్పంచ్ ముషినేపల్లి కుమార్ గౌడ్ వివరించారు.మంత్రులు సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, వాకిటి శ్రీహరితో పాటు ఉన్నతాధికారులు, అదనపు కలెక్టర్లు, జిల్లా అధికారులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ములుగు జిల్లా ఇంచర్ల గ్రామ సర్పంచ్ ముషినేపల్లి కుమార్ గౌడ్ వర్క్‌షాప్‌లో ప్రసంగించారు.
గ్రామాల్లో నీటి సంరక్షణ, వ్యవసాయ చెరువుల నిర్మాణం, గ్రామీణ ఉపాధి కల్పన, వ్యవసాయం–ఉద్యానవనం–పశుసంవర్థక–మత్స్య శాఖల సమన్వయం ద్వారా గ్రామ సమగ్ర అభివృద్ధికి చర్యలు చేపట్టాల్సిన అవసరాన్ని ఆయన వివరించారు.
వర్షాభావ పరిస్థితులను ముందుగానే అంచనా వేసి, రైతులకు నీటి భద్రత కల్పించేలా వ్యవసాయ చెరువులు, నీటి సంరక్షణ పనులకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. వీబీ-జీ రామ్‌జీ ద్వారా గ్రామాల్లో అవసరమైన పనులను ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని కోరారు.
గ్రామ పంచాయతీల ఆర్థిక వనరులను బలోపేతం చేసి, గ్రామ సమగ్ర అభివృద్ధి ప్రణాళికలను సమర్థవంతంగా అమలు చేయాల్సిన అవసరాన్ని సర్పంచ్ ముషినేపల్లి కుమార్ గౌడ్ వివరించారు.