- District News
- Ranga Reddy
- చటాన్‌పల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులపై ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అధికారులతో సమీక్ష
చటాన్‌పల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులపై ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అధికారులతో సమీక్ష
అధికారులకు పలు కీలక సూచనలు.. పనులు వేగవంతం చేయాలని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆదేశం
Published On
By Ram Reddy
( లోకల్ గైడ్ షాద్ నగర్ )
రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే చటాన్‌పల్లి పరిసర ప్రాంత ప్రజలకు, వాహనదారులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడంతో పాటు ప్రజల రాకపోకలకు మరింత సౌకర్యవంతమైన మార్గం ఏర్పడుతుందని తెలిపారు. అందువల్ల నిర్మాణ పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
సమీక్ష సందర్భంగా వివిధ శాఖల పరిధిలో చేపట్టాల్సిన పనులు, అవసరమైన అనుమతులు, రహదారి సంబంధిత అంశాలు, విద్యుత్ లైన్ల మార్పిడి, మిషన్ భగీరథ పైపులైన్లకు సంబంధించిన సమస్యలు, ట్రాఫిక్ నియంత్రణ తదితర అంశాలపై అధికారులతో ఎమ్మెల్యే చర్చించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పనులను ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని, నిర్మాణ పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఆర్‌ఓబీ నిర్మాణానికి సంబంధించి వివిధ శాఖల మధ్య సమన్వయం అత్యంత కీలకమని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. అన్నారు. సూచించారు.ఈ సమీక్ష సమావేశంలో స్థానిక ఆర్డీవో ఎన్.ఆర్. సరిత, డీఈ ( ఆర్ &బి ), స్థానిక మున్సిపల్ కమిషనర్ స్థానిక ఎమ్మార్వో నాగయ్య, సునీత, పోలీస్ శాఖ తరఫున ట్రాఫిక్ సీఐ శంకరయ్య, మిషన్ భగీరథ అధికారులు, విద్యుత్ శాఖ అధికారులు తదితర సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. ఆర్‌ఓబీ నిర్మాణ పనులను సకాలంలో పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులు ఈ సందర్భంగా నిర్ణయించారు.
Tags:
About The Author
Related Posts
Latest News
18 Sep 2026 20:05:47
శంకర్ పల్లి, (లోకల్ గైడ్ ):
జన్వాడ ఫార్మ్ హౌస్ భూములపై జరుగుతున్న ప్రచారం రాజకీయ పార్టీల నేతలు పరిశీలనకు వస్తారన్న వార్తల నేపథ్యంలో ఫార్మ్
