ప్రజల సమస్యలు పరిష్కారం కోసమే ప్రజావాణి కార్యక్రమం ఉద్దేశం.                  

Published On
ప్రజల సమస్యలు పరిష్కారం కోసమే ప్రజావాణి కార్యక్రమం ఉద్దేశం.                  
 
రంగారెడ్డి జిల్లా బ్యూరో, (లోకల్ గైడ్ ):                                  ప్రజల సమస్యల పరిష్కారం కోసమే ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు రంగారెడ్డి జిల్లా రెవెన్యూ అధికారిని శారదా దేవి అన్నారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి (136) ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదు దారులు తమ సమస్యలను జిల్లా రెవెన్యూ అధికారి శారద దేవికి  విన్న విస్తూ అర్జీలు సమర్పించారు.
ఈ సందర్భంగా డిఆర్ఓ శారద దేవి  మాట్లాడుతూ  ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు అందించే వినతులను సంబంధిత శాఖల జిల్లా అధికారులు తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
రెవెన్యూ శాఖ–60, ఇతర శాఖలు -76, మొత్తం దరఖస్తులు అందాయి.
ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ సూపరింటెండెంట్లు,  సంబంధిత   అధికారులు తదితరులు    పాల్గొన్నారు.
Tags:

About The Author

Latest News

వాసన్ ఐ కేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నేత్రదానంపై అవగాహన కార్యక్రమం వాసన్ ఐ కేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నేత్రదానంపై అవగాహన కార్యక్రమం
ఖమ్మం,ఆగస్టు,30: లోకల్ గైడ్:ఖమ్మం : వాసన్ ఐ కేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నేత్రదానంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు . ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఖమ్మం నగర మాజీ...
తుక్కుగూడలోని ప్రైమ్ కేర్ హాస్పిటల్లో నర్స్ దారుణ హత్య. 
మణికొండలో వాక్ విత్ హైడ్రా ర్యాలీ 
మిషనరీ చర్చి భూములను పరిరక్షించాలి.
శిరీష మృతిపై సమగ్ర దర్యాప్తు జరపాలి
బోటనీ అధ్యాపకుడి కోసం దరఖాస్తుల ఆహ్వానం.
ప్రజలతో మమేకమైన పోలీసింగ్