- District News
- Ranga Reddy
- ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వ విద్యాలయం ద్వారానే ఉద్యోగులకు జీతాలు – హెల్త్ కార్డ్
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వ విద్యాలయం ద్వారానే ఉద్యోగులకు జీతాలు – హెల్త్ కార్డ్
సౌకర్యం కల్పించాలి- టాసా, నాన్ టీచింగ్ అసోసియేషన్ నాయకుల డిమాండ్.
Published On
By Ram Reddy

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారానే ఉద్యోగుల జీతాల చెల్లింపును కొనసాగించాలని తెలంగాణ అగ్రికల్చర్ సైంటిస్ట్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు కే. పవన్ చంద్రా రెడ్డి, డాక్టర్ సల్ల సౌజన్య, నాన్-టీచింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ జయరాం, సులోచనలు ఓ పత్రిక ప్రకటనలో డిమాండ్ చేశారు. గతంలో మాదిరిగానే విశ్వవిద్యాలయం ద్వారానే ఈ ప్రక్రియ కొనసాగించాలన్నారు. బోధనా, బోధనేతర ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా హెల్త్ కార్డ్ సౌకర్యం కల్పించాలని అసోసియేషన్ల నాయకులు కోరారు.
అదే విధంగా సంఘాల ప్రతినిధులు టి ఎన్ జీ ఓ సెంట్రల్ యూనియన్ కు వినతిపత్రం సమర్పించి ఈ అంశాలపై తెలంగాణ ప్రభుత్వంతో చర్చించి ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వ విద్యాలయం ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన విశ్వవిద్యాలయమన్నారు. ప్రత్యేక పరిపాలనా, ఆర్థిక వ్యవస్థలను కలిగి ఉందని సంఘాలు పేర్కొన్నాయి. జీతాలను ప్రభుత్వ ట్రెజరీ ద్వారా చెల్లించే విధానానికి మారడం వల్ల ఎస్ ఎల్ ఎస్ సప్లిమెంటరీ బిల్లులు, రుణాలు, అడ్వాన్సులు, అలవెన్సులు తదితర సర్వీస్ సంబంధిత ఆర్థిక అంశాల్లో ఉద్యోగులకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉందని తెలిపారు. అందువల్ల ప్రస్తుతం ఉన్న విశ్వవిద్యాలయం ద్వారా జీతాల చెల్లింపు విధానాన్ని కొనసాగించాలని కోరారు.
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు అందుతున్న హెల్త్ కార్డ్ సౌకర్యాన్ని విశ్వ విద్యాలయంలోని బోధనా, బోధనేతర ఉద్యోగులకు, వారి అర్హత కలిగిన ఆధారిత కుటుంబ సభ్యులతో సహా కల్పించాలని డిమాండ్ చేశారు.
టి ఎన్ జీ ఓ సెంట్రల్ యూనియన్ జోక్యం చేసుకొని తెలంగాణ ప్రభుత్వంతో చర్చించి, విశ్వవిద్యాలయం ద్వారానే జీతాల చెల్లింపు కొనసాగింపు, హెల్త్ కార్డ్ సౌకర్యం కల్పించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని టాసా వైస్ ప్రెసిడెంట్ కమలాకర్, నాన్-టీచింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ జయరాం, సులోచన, రాజు తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Related Posts
Latest News
20 Aug 2026 12:29:38
రాజేంద్ర నగర్ 19 ఆగస్టు ( లోకల్ గైడ్ ) పోగొట్టుకున్న కున్న 25 మొబైల్ ఫోన్లను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సి.ఇ.ఐ.ఆర్ పోర్టల్ సహాయంతో
