రాజీవ్ గాంధీ ఆశయాల సాధనకు ప్రతి కార్యకర్త కృషి చేయాలి

ఇమ్మడి తిరుపతిరావు

Published On
రాజీవ్ గాంధీ ఆశయాల సాధనకు ప్రతి కార్యకర్త కృషి చేయాలి

 

 


ఖమ్మం జిల్లా, కారేపల్లి, ఆగస్టు 20 (లోకల్ గైడ్) :
మాజీ ప్రధానమంత్రి, దివంగత స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా కారేపల్లి మండల కేంద్రంలోని వినాయక ఫెర్టిలైజర్ షాప్ వద్ద కాంగ్రెస్ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ నాయకులు ఇమ్మడి తిరుపతిరావు మాట్లాడుతూ.. భారతదేశ అభివృద్ధికి రాజీవ్ గాంధీ చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. దేశంలో సమాచార సాంకేతిక రంగానికి బలమైన పునాది వేసిన ఘనత రాజీవ్ గాంధీదేనని పేర్కొన్నారు. యువతకు సాంకేతిక విద్య, ఆధునిక ఆలోచనలను అందుబాటులోకి తీసుకురావడంలో ఆయన కీలక పాత్ర పోషించారని తెలిపారు. రాజీవ్ గాంధీ ఆశయాలు, దేశాభివృద్ధి కోసం ఆయన కలలు కన్న భారతదేశ నిర్మాణం కోసం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కృషి చేయాలని ఇమ్మడి తిరుపతిరావు పిలుపునిచ్చారు. ఆయన సేవలను స్మరించుకోవడమే కాకుండా, ఆయన ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కాంగ్రెస్ శ్రేణులపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మల్లెల నాగేశ్వరరావు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు సురేందర్ మణియార్, తోగర శ్రీను, ఎం. మల్లేష్, పాలిక వీరయ్య, కేతిమల సుధాకర్, ఆవుల సాగర్, ఆదేల శ్రీను, రాబోతు కోటయ్య, తురక రవి, యార్నగి ముత్తయ్య, ఆరేళ్ల నర్సయ్య, దుర్గా, అనీల్, పబ్బుల శేషయ్య, ఇదిగాని సీను తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

పోగొట్టుకున్న 25 మొబైల్ ఫోన్లు సిఈఐఆర్ పోర్టల్ ద్వారా రికవరీ..                                                                 పోగొట్టుకున్న 25 మొబైల్ ఫోన్లు సిఈఐఆర్ పోర్టల్ ద్వారా రికవరీ..                                                                
    రాజేంద్ర నగర్ 19 ఆగస్టు ( లోకల్ గైడ్ )                                              పోగొట్టుకున్న కున్న 25 మొబైల్ ఫోన్లను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సి.ఇ.ఐ.ఆర్ పోర్టల్ సహాయంతో
వ్యవసాయం పరిశోధనలు క్షేత్రస్థాయిలో చేరాలంటే మీడియా పాత్ర ఎంతో కీలకం. పై మీడియా సమన్వయం ఎంతో
రాజీవ్ గాంధీ ఆశయాల సాధనకు ప్రతి కార్యకర్త కృషి చేయాలి
బయ్యారం బస్టాండ్ సెంటర్లో ఘనంగా రాజీవ్ గాంధీ 82వ జయంతి
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వ విద్యాలయం ద్వారానే ఉద్యోగులకు  జీతాలు – హెల్త్ కార్డ్
ప్రాసిక్యూషన్ రివ్యూ కమిటీ సమావేశం 
ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం