- District News
- బయ్యారం బస్టాండ్ సెంటర్లో ఘనంగా రాజీవ్ గాంధీ 82వ జయంతి
బయ్యారం బస్టాండ్ సెంటర్లో ఘనంగా రాజీవ్ గాంధీ 82వ జయంతి
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం లో బయ్యారం బస్టాండ్ సెంటర్లో భారతదేశ మాజీ ప్రధాని, భారత రత్న, స్వర్గస్తులు రాజీవ్ గాంధీ 82వ జయంతి ని జగ్గు తండా గ్రామ శాఖ మాజీ అధ్యక్షులు బానోత్ నాగరాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
బయ్యారం మెయిన్ రోడ్డు నందు గల రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద బయ్యారం మండల కాంగ్రెస్ అధ్యక్షులు జూలకంటి సీతారాం రెడ్డి పార్టీ శ్రేణులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా జూలకంటి సీతారాం రెడ్డి మాట్లాడుతూ..
*"రాజీవ్ గాంధీ కంప్యూటర్ విప్లవం, పంచాయతీరాజ్, యువతకు ఆదర్శం అతి చిన్న వయసులోనే భారతదేశ ప్రధానిగా రాజీవ్ గాంధీ అయ్యారు అని రాజీవ్ గాంధీ గొప్పతనాన్ని కొనిఆడారు.*
*ఈ కార్యక్రమంలో బయ్యారం మండల నాయకులు తిరుమల ప్రభాకర్ రెడ్డి, పగడాల శ్రీను,తమ్మిశెట్టి వెంకటపతి, కొత్త వినయ్ బాబు, కంకటి నారాయణ, లకావత్ వెంకన్న, పోతుగంటి సుమన్, .ప్రమోద్ రెడ్డి, నిమ్మగడ్డ శివకుమార్, మూడ్ వీరన్న, యాకుబ్, అనుబంధ సంఘాల నాయకులు, కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు.*
