- District News
- పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ భద్రాచలం డివిజన్ ఆధ్వర్యంలో
పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ భద్రాచలం డివిజన్ ఆధ్వర్యంలో
ఆగస్టు 10న ఉచిత కంటి పరీక్షా శిబిరం
Published On
By Ram Reddy
ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ భద్రాచలం డివిజన్ ఆధ్వర్యంలో ఆగష్టు 10వ తేదీ (సోమవారం) ఉచిత కంటి పరీక్షా శిబిరాన్ని నిర్వహించనున్నట్లు డివిజన్ అధ్యక్షులు బందు వెంకటేశ్వరరావు తెలిపారు. భద్రాచలంలోని పాత ఎల్ఐసీ కార్యాలయం ఎదురుగా ఉన్న అసోసియేషన్ కార్యాలయంలో వరంగల్ శరత్ మాక్సివిజన్ కంటి ఆసుపత్రి వైద్యులచే ఈ శిబిరం నిర్వహించబడుతుందని పేర్కొన్నారు. కంటి పరీక్షల్లో క్యాటరాక్ట్ ఉన్నట్లు నిర్ధారణ అయిన వారికి వరంగల్‌కు ఉచిత రవాణా సౌకర్యంతో తీసుకెళ్లి శస్త్రచికిత్స నిర్వహించడంతో పాటు వసతి, భోజనం, మందులు పూర్తిగా ఉచితంగా అందజేస్తారని తెలిపారు. ఆపరేషన్ అనంతరం తిరిగి భద్రాచలంలోని అసోసియేషన్ కార్యాలయం వరకు ఉచితంగా తీసుకువస్తారని వివరించారు. శిబిరానికి హాజరయ్యే వారు తప్పనిసరిగా తమ హెల్త్ కార్డు వెంట తీసుకురావాలని నిర్వాహకులు కోరారు. ఈ ప్రకటనను అధ్యక్షులు బందు వెంకటేశ్వరరావు, గౌరవ అధ్యక్షులు సుబ్బయ్య చౌదరి, ప్రధాన కార్యదర్శి కె.ఎస్.ఎల్.వి. ప్రసాద్, మాదిరెడ్డి రామ్మోహనరావు, కోశాధికారి డి. కృష్ణమూర్తి, సీనియర్ ఉపాధ్యక్షులు ముగడ హరినాథ్, ఎస్. రాజబాబు విడుదల చేశారు. కార్యక్రమంలో విష్ణు, మొలకల సుబ్రహ్మణ్యం, మల్యాల కిషన్‌రావు, గోర్సా మురళీకృష్ణ, టీ. దాసు, చుక్క రాంబాబు, కన్నయ్యలాల్, వి. రాంబాబు, సూరిశెట్టి కృష్ణ, శ్యాంసుందరరావు, పురుషోత్తం బన్సీలాల్, ఎన్. జగన్మోహనరావు తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Related Posts
Latest News
07 Aug 2026 19:39:23
ముఖ్యఅతిథిగా హాజరైన బిజెపి జిల్లా అధ్యక్షుడు యు. రమేష్ కుమార్.
- శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపిన పూజారి పాండు.
