పోగొట్టుకున్న 25 మొబైల్ ఫోన్లు సిఈఐఆర్ పోర్టల్ ద్వారా రికవరీ..                                                                

బాధితులకు అందజేసిన అత్తాపూర్ పోలీసులు. 

Published On
పోగొట్టుకున్న 25 మొబైల్ ఫోన్లు సిఈఐఆర్ పోర్టల్ ద్వారా రికవరీ..                                                                

 

రాజేంద్ర నగర్ 19 ఆగస్టు ( లోకల్ గైడ్ )                                              పోగొట్టుకున్న కున్న 25 మొబైల్ ఫోన్లను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సి.ఇ.ఐ.ఆర్ పోర్టల్ సహాయంతో రికవరీ చేసినట్లు అత్తాపూర్ ఇన్స్పెక్టర్ ఎ. సీతయ్య తెలిపారు. సుమారు ₹2,00,000/- (రెండు లక్షల రూపాయలు) విలువ కలిగిన 25 మొబైల్ ఫోన్లను  బుధవారం నాడు బాధితులకు అందజేశారు.
ఈ సందర్భంగా అత్తాపూర్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎ. సీతయ్య మాట్లాడుతూ ఫోన్ బాధితులను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి, తగిన ఆధారాలు సరిచూసుకున్న అనంతరం వారి మొబైల్ ఫోన్లను నేరుగా అందజేశారు. పోయాయనుకున్న తమ విలువైన ఫోన్లు తిరిగి లభించడంతో బాధితులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తూ, అత్తాపూర్ పోలీసులకు, క్రైమ్ టీమ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ ఎ. సీతయ్య మాట్లాడుతూ "ఎవరైనా తమ మొబైల్ ఫోన్లను పోగొట్టుకున్నా లేదా దొంగతనానికి గురైనా కంగారు పడకుండా వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌లో గానీ లేదా ఆన్‌లైన్ ద్వారా క్యూర్ పోర్టల్‌లో ఫిర్యాదు నమోదు చేసుకోవాలి. సి ఈ ఐ ఆర్ పోర్టల్‌లో ఐఎంఈఐ (ఐ ఎం ఈ ఆర్ నంబర్‌ను బ్లాక్ చేయడం ద్వారా ఫోన్ దుర్వినియోగం కాకుండా చూడటమే కాకుండా, దానిని త్వరగా ట్రాక్ చేసి రికవరీ చేయడానికి సులభమవుతుంది అని సూచించారు.
ఈ కార్యక్రమంలో అత్తాపూర్ పోలీస్ స్టేషన్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్  రాజు నాయక్ తో పాటు క్రైమ్ టీమ్ సిబ్బంది పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

పోగొట్టుకున్న 25 మొబైల్ ఫోన్లు సిఈఐఆర్ పోర్టల్ ద్వారా రికవరీ..                                                                 పోగొట్టుకున్న 25 మొబైల్ ఫోన్లు సిఈఐఆర్ పోర్టల్ ద్వారా రికవరీ..                                                                
    రాజేంద్ర నగర్ 19 ఆగస్టు ( లోకల్ గైడ్ )                                              పోగొట్టుకున్న కున్న 25 మొబైల్ ఫోన్లను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సి.ఇ.ఐ.ఆర్ పోర్టల్ సహాయంతో
వ్యవసాయం పరిశోధనలు క్షేత్రస్థాయిలో చేరాలంటే మీడియా పాత్ర ఎంతో కీలకం. పై మీడియా సమన్వయం ఎంతో
రాజీవ్ గాంధీ ఆశయాల సాధనకు ప్రతి కార్యకర్త కృషి చేయాలి
బయ్యారం బస్టాండ్ సెంటర్లో ఘనంగా రాజీవ్ గాంధీ 82వ జయంతి
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వ విద్యాలయం ద్వారానే ఉద్యోగులకు  జీతాలు – హెల్త్ కార్డ్
ప్రాసిక్యూషన్ రివ్యూ కమిటీ సమావేశం 
ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం