రూ.90 లక్షల మోసం చేసిన మహిళా పై కేసు నమోదు 

Published On
రూ.90 లక్షల మోసం చేసిన మహిళా పై కేసు నమోదు 

గండిపేట, ఆగస్టు 6 (లోకల్ గైడ్):

పెట్టుబడి పై అధిక లాభాలు వస్తాయని నమ్మించి రూ. 90 లక్షల తీసుకొని తిరిగి చెల్లించకుండా మోసానికి పాల్పడిన మహిళాపై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. నార్సింగి  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... శంకర్పల్లి మండలం మోకిలా గ్రామానికి చెందిన చింతపల్లి రాణి గృహిణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. తిరుమల హిల్స్ మణికొండ కు చెందిన పట్లోళ్ల రూపా రెడ్డి 2021 లో పరిచయం అయ్యారని, అత్యవసర అవసరాల కోసం డబ్బు కావాలని చెప్పడంతో విడతల వారీగా మొత్తం రూ. 90 లక్షలు ఇచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అనేకసార్లు డబ్బు తిరిగి ఇవ్వాలని కోరగా మొదట బాండ్ రాసి ఇచ్చి, అనంతరం రూ.1 కోటి చెక్కు ఇచ్చారని అయితే ఆ బ్యాంకులో తగినంత నిధులు లేకపోవడంతో చెక్ బౌన్స్ అయిందని ఫిర్యాదుదారులు తెలిపారు. అనంతరం మరో రెండు చెక్కులు ఇచ్చిన వాటికి నగదు మార్చుకోవద్దని కోరుతూ రూపా రెడ్డి తప్పించుకుంటూ వచ్చారని ఆమె ఆరోపించారు. ఈ ఏడాది ఆగస్టు 5వ తేదీన డబ్బు కోసం రూపా రెడ్డి నివాసానికి వెళ్లక, డబ్బు ఇవ్వడానికి నిరాకరించడం కాకుండా దుర్భాషలాడి బెదిరింపులకు పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు ఆధారంగా నార్సింగి పోలీసులు ( బిఎన్ఎస్ ) సెక్షన్లు 316 (2), 318(4) 351 (2) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Tags:

About The Author

Latest News