గురువుల సేవలను మరవలేం....

ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

Published On
గురువుల సేవలను మరవలేం....

గండిపేట, సెప్టెంబర్ 05 (లోకల్ గైడ్ ):

డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్  జయంతిని పురస్కరించుకుని ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను శనివారం   నార్సింగి సర్కిల్ మణికొండ ఎంపీపీఎస్ పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులను మణికొండ కాంగ్రెస్ పార్టీ డివిజన్ బుధోలు శ్రీరాములు  ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా శ్రీరాములు గారు .. విద్యార్థుల భవిష్యత్తుకు ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. విద్యార్థులకు బాల్యం నుంచే నాణ్యమైన విద్య, మంచి విలువలు, క్రమశిక్షణను అందిస్తూ వారిని ఉన్నత శిఖరాలకు చేర్చడంలో ఉపాధ్యాయులు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. గురువుల సేవలను మరవలేం అని ఆయన కొనియాడారు. విద్యార్థుల జీవితంలో తొలి అడుగు నుంచే సరైన మార్గనిర్దేశం చేస్తూ వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తున్న ఉపాధ్యాయుల సేవలు మరువలేనివని కొనియాడారు.అనంతరం ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నార్సింగి వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఎర్పులా కుమార్ , నాయకులు శ్రవణ్ కుమార్ సంతోష్, సురేష్ గౌడ్, శివగంగ తదితరులు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

పేదల పొట్టపై ధరల పోటు.. ఉపాధి హామీ బలోపేతం చేయాలి పేదల పొట్టపై ధరల పోటు.. ఉపాధి హామీ బలోపేతం చేయాలి
        కారేపల్లి (సింగరేణి), సెప్టెంబర్ 17 (లోకల్ గైడ్ న్యూస్) : నిత్యావసర సరుకుల ధరలు రోజురోజుకూ పెరుగుతూ పేదల జీవనంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని, ధరల
బియ్యంతో శ్రీ వెంకటేశ్వర స్వామి రూపంలో గణనాథుడి ప్రతిష్ట 
అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తెలంగాణ… రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
కిలారి సుశీలకు నివాళి
చిరుమర్రి చెరువు వద్ద రూ. 2.90 కోట్లతో పర్యాటక వసతుల అభివృద్ధి
సెప్టెంబర్‌ 17.. పోరాట చరిత్రకు మైలురాయి
ప్రభుత్వ, వైద్య కళాశాల సీట్లు సాధించిన పూర్వ విద్యార్థులకు ఘన సన్మానం