ఆమనగల్లులో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలు

ముఖ్య అతిథులుగా తల్లోజు ఆచారి, పత్య నాయక్, చుక్క అల్లాజి గౌడ్ లోకల్ గైడ్

Published On
ఆమనగల్లులో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలు

న్యూస్ స్టార్ట్ 




ఆమనగల్లు, ఆగస్టు 18:
రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలోని కంఠమేశ్వర గుట్టపై సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలను గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాపన్న గౌడ్ విగ్రహానికి గౌడ సంఘం నాయకులు, కుల పెద్దలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ జాతీయ నాయకులు, మాజీ ఓబీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారి మాట్లాడుతూ.. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ తెలంగాణ గడ్డపై సామాజిక సమానత్వం, ఆత్మగౌరవం కోసం పోరాడిన గొప్ప వీరుడని కొనియాడారు. అణగారిన వర్గాల ప్రజల్లో ఆత్మవిశ్వాసం నింపి, అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడిన పాపన్న గౌడ్ చరిత్రను నేటి యువత తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆయన పోరాట స్ఫూర్తి, ధైర్యం, సామాజిక న్యాయం కోసం చేసిన కృషి భావితరాలకు ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు.

కల్వకుర్తి తాలూకా గౌడ సంఘం అధ్యక్షుడు, మున్సిపల్ కోఆప్షన్ సభ్యుడు చుక్క అల్లాజి గౌడ్ మాట్లాడుతూ.. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతిని ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహించుకోవడం గౌడ సమాజానికి గర్వకారణమన్నారు. పాపన్న గౌడ్ చూపిన ధైర్యం, ఆత్మగౌరవం, సామాజిక న్యాయం కోసం చేసిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. గౌడ సమాజం ఐక్యంగా ఉండి విద్య, ఉపాధి, సామాజిక అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపునిచ్చారు.

ఆమనగల్లు మున్సిపల్ చైర్మన్ పత్య నాయక్ మాట్లాడుతూ.. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు కంఠమేశ్వర గుట్టపై ఘనంగా నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. పాపన్న గౌడ్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని సమాజంలో ఐక్యతను పెంపొందించడంతో పాటు యువత విద్య, ఉపాధి రంగాల్లో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. గౌడ సమాజ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు.

కార్యక్రమంలో  కౌన్సిలర్లు పాపిశెట్టి రాము, మోక్తాల వెంకటయ్య, ఎర్రవోలు మహేష్, 
 కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శివలింగం, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చుక్క నిరంజన్ గౌడ్, మాజీ వార్డు సభ్యుడు పూసల సత్యం, గౌడ సంఘం మండల నాయకులు ఎంగాలి ప్రసాద్, సురేష్ నాయక్, డి. మహేష్, గంగ రవి గౌడ్, గజ్జ వెంకటయ్య గౌడ్, పాపన్న యూత్ ప్రెసిడెంట్ రాఘవేందర్ గౌడ్, నరేష్, నిరంజన్, నరసింహ, బాలకృష్ణ, అల్లాజి, సతీష్, కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు, గౌడ సంఘం కుల పెద్దలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పాపన్న గౌడ్ ఆశయాలను కొనసాగిస్తూ సామాజిక ఐక్యత, ఆత్మగౌరవం, సమాజ అభ్యున్నతి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు

Tags:

About The Author

Latest News