రుద్రారం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్పోర్ట్స్ యూనిఫామ్స్ పంపిణీ

క్రీడలతో విద్యార్థుల్లో క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయి: బక్కి వెంకటయ్య

Published On
రుద్రారం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్పోర్ట్స్ యూనిఫామ్స్ పంపిణీ

అక్బర్ పేట భూంపల్లి:రుద్రారం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థిని, విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య చేతుల మీదుగా స్పోర్ట్స్ యూనిఫామ్స్ పంపిణీ చేశారు. స్థానిక పాఠశాల చంద్రారెడ్డి స్నేహితులు సంజీవరెడ్డి,IMG-20260818-WA0087 మహేందర్ రెడ్డి, బూర శ్రీకాంత్, అమర్, అజయ్ సహకారంతో ఈ యూనిఫామ్స్ అందజేశారు.ఈ సందర్భంగా బక్కి వెంకటయ్య మాట్లాడుతూ విద్యార్థుల్లో విద్యతో పాటు క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించడం ఎంతో ముఖ్యమన్నారు. క్రీడలు విద్యార్థుల్లో శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, సమయపాలన, నాయకత్వ లక్షణాలు, జట్టు స్ఫూర్తి, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని తెలిపారు.గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అవసరమైన ప్రోత్సాహం, సౌకర్యాలు కల్పిస్తే వారు రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులకు అవసరమైన సమయంలో తన వంతు సహాయ సహకారాలు అందించేందుకు ఎల్లప్పుడూ ముందుంటానని బక్కి వెంకటయ్య తెలిపారు.విద్యార్థులకు స్పోర్ట్స్ యూనిఫామ్స్ అందించినందుకు పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఈదారి చంద్రకళ కనకయ్య, వార్డు సభ్యులు, మాజీ ఎంపీటీసీ పోతారం మురళి, ఏఎంసీ మాజీ డైరెక్టర్ రాజేశ్వర్ రెడ్డి, బీఆర్‌ఎస్ నాయకులు పడాల రాజు, ప్రభాకర్, రావు, నేరెళ్ల నవీన్, పత్తి నరసింహులు, కటికే రాజు, పార బాలరాజు, షేరీ శేఖర్, పిట్ల లక్ష్మీ నరసయ్య, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News