తెలంగాణ విమోచన ఉత్సవ సమితి కన్వీనర్‌గా నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి

సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా అధికారికంగా ప్రకటించాలి – నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి

Published On
తెలంగాణ విమోచన ఉత్సవ సమితి కన్వీనర్‌గా నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి

( లోకల్ గైడ్ షాద్ నగర్ )

 తెలంగాణ విమోచన ఉత్సవాలను రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు  ఏర్పాటు చేసిన తెలంగాణ విమోచన ఉత్సవ సమితి కన్వీనర్‌గా బీజేపీ రాష్ట్ర నాయకుడు  నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి నియమితులయ్యారు.
తనపై నమ్మకం ఉంచి ఈ కీలక బాధ్యతను అప్పగించిన రాష్ట్ర అధ్యక్షులు  ఎన్. రాంచందర్ రావు కు నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. గతంలో కూడా తెలంగాణ విమోచన కమిటీ చైర్మన్‌గా పనిచేసి అనేక కార్యక్రమాలను నిర్వహించిన అనుభవం తనకు ఉందని, ఇప్పుడు అప్పగించిన బాధ్యతను కూడా పూర్తి అంకితభావంతో నిర్వహిస్తానని తెలిపారు.
సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.
1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ, అప్పటి హైదరాబాద్ సంస్థానం నిజాం పాలనలోనే కొనసాగిందని, రజాకారుల దాష్టీకానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు సాగించిన పోరాటంలో అనేక మంది ప్రాణత్యాగాలు చేశారని గుర్తు చేశారు. చివరకు అప్పటి కేంద్ర హోంమంత్రి సర్దార్ వల్లభభాయ్ పటేల్ నాయకత్వంలో నిర్వహించిన ఆపరేషన్ పోలో అనంతరం 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమైందని పేర్కొన్నారు.
తెలంగాణ విమోచన కోసం పోరాడి ప్రాణత్యాగం చేసిన అమరవీరుల త్యాగాలను ప్రతి సంవత్సరం స్మరించుకోవడం మనందరి బాధ్యత అని అన్నారు. వారి పోరాట చరిత్రను భావితరాలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వం సెప్టెంబర్ 17కు తగిన ప్రాధాన్యత ఇవ్వకుండా తెలంగాణ విమోచన పోరాట చరిత్రను విస్మరించిందని విమర్శించారు. గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ అంశాన్ని పట్టించుకోలేదని అన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సెప్టెంబర్ 17ను ‘ప్రజా పాలన దినోత్సవం’ పేరుతో నిర్వహిస్తూ, తెలంగాణ విమోచన పోరాటం మరియు అమరవీరుల త్యాగాలకు తగిన గుర్తింపు ఇవ్వడం లేదని ఆరోపించారు.
రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణ విమోచన చరిత్రను మరుగునపరచడం సరికాదని అన్నారు. నిజాం, రజాకారుల నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన వీరుల త్యాగాలను గౌరవించడం ప్రతి ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు.
తెలంగాణ విమోచన ఉత్సవ సమితి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించి, తెలంగాణ విమోచన పోరాట చరిత్రను ప్రజల్లోకి తీసుకెళ్తామని  నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి తెలిపారు.
“తెలంగాణ విమోచన పోరాటం మన చరిత్ర.. అమరవీరుల త్యాగం మన స్ఫూర్తి. సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా అధికారికంగా ప్రకటించే వరకు బీజేపీ ప్రజల తరఫున పోరాటం కొనసాగిస్తుంది.” అని  నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు.

Tags:

About The Author

Latest News

వాసన్ ఐ కేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నేత్రదానంపై అవగాహన కార్యక్రమం వాసన్ ఐ కేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నేత్రదానంపై అవగాహన కార్యక్రమం
ఖమ్మం,ఆగస్టు,30: లోకల్ గైడ్:ఖమ్మం : వాసన్ ఐ కేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నేత్రదానంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు . ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఖమ్మం నగర మాజీ...
తుక్కుగూడలోని ప్రైమ్ కేర్ హాస్పిటల్లో నర్స్ దారుణ హత్య. 
మణికొండలో వాక్ విత్ హైడ్రా ర్యాలీ 
మిషనరీ చర్చి భూములను పరిరక్షించాలి.
శిరీష మృతిపై సమగ్ర దర్యాప్తు జరపాలి
బోటనీ అధ్యాపకుడి కోసం దరఖాస్తుల ఆహ్వానం.
ప్రజలతో మమేకమైన పోలీసింగ్