తెలంగాణ "విప్లవ జ్యోతి" సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్.

వీరత్వానికి నిలువెత్తు ప్రతిరూపం సర్వాయి పాపన్న. - అణగారిన వర్గాల ఆత్మగౌరవానికి స్ఫూర్తిదాయకుడు.

ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి.  - తాండూర్ మున్సిపల్ చైర్‌పర్సన్ నీరజ బాల్‌రెడ్డి
Published On
తెలంగాణ

లోకల్ గైడ్/తాండూర్:
తెలంగాణ విప్లవ జ్యోతి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్... వీరత్వానికి నిలువెత్తు ప్రతిరూపమని తాండూర్ మున్సిపల్ చైర్‌పర్సన్ నీరజ బాల్‌రెడ్డి కొనియాడారు. మంగళవారం తాండూర్ పట్టణంలోని పోట్లీ మహారాజు దేవాలయం సమీపంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలను గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన చైర్‌పర్సన్ నీరజ బాల్‌రెడ్డితో పాటు గౌడ సంఘం నాయకులు, వివిధ పార్టీల నాయకులు సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన జయంతిని పురస్కరించుకుని గౌడ సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్,బిఆర్ఎస్ యువ నాయకుడు సంతోష్ గౌడ్ తదితరులు మాట్లాడుతూ.. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వీరత్వం, ధైర్యసాహసాలు, అణగారిన వర్గాల ఆత్మగౌరవం కోసం ఆయన చేసిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. సమాజంలో సమానత్వం, ఐక్యత కోసం సర్వాయి పాపన్న చూపిన మార్గాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.
సర్వాయి పాపన్న గౌడ్ జయంతి, వర్ధంతి వేడుకలను భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు గౌడ సామాజిక వర్గానికి చెందిన ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని వారు కోరారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు గౌడ సామాజిక వర్గం ఐక్యంగా కృషి చేయాలని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మనోజ్ గౌడ్ మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో పోట్లీ మహారాజు దేవాలయ చైర్మన్ పదవి గౌడ సామాజిక వర్గానికి దక్కేలా ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి కృషి చేయాలని కోరారు. గతంలో పోట్లీ మహారాజు దేవాలయ చైర్మన్ పదవిని గౌడ సామాజిక వర్గానికి ఇస్తానని బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి హామీ ఇచ్చి మాట తప్పారని ఆరోపించారు. గత పరిస్థితులు పునరావృతం కాకుండా చైర్మన్ పదవిని గౌడ సామాజిక వర్గానికి ఇవ్వాలని ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డిని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో గ్రంథాలయ మాజీ చైర్మన్లు మురళి గౌడ్, రాజు గౌడ్, సుదర్శన్ గౌడ్, కౌన్సిలర్ జుంటుపల్లి వెంకట్, నారా శ్రీకాంత్, రాజు గౌడ్, మాజీ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, మనోజ్ గౌడ్, ప్రవీణ్ గౌడ్, గౌడ సంఘం నాయకులు, వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్‌కు బీఆర్‌ఎస్ నాయకుల ఘన నివాళి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్‌కు బీఆర్‌ఎస్ నాయకుల ఘన నివాళి
    తెలంగాణ బహుజనుల ఆత్మగౌరవానికి, ధీరత్వానికి ప్రతీకగా నిలిచిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్‌ఎస్ నాయకులు ఆయన
సర్వాయి పాపన్న ఆశయాలే బహుజనుల ఆత్మగౌరవానికి మార్గదర్శకం
తెలంగాణ "విప్లవ జ్యోతి" సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్.
నేడు శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి నిర్వహణ... జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్
పట్టణ ప్రజల సౌకర్యార్థం మేరకే లిటిల్ కార్డు డోర్ డెలివరీ యాప్. 
పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి.
నవీన్ కుటుంబానికి రూ.2 కోట్ల పరిహారం ఇవ్వాలి : అడ్డగోడ ఐలయ్య