- District News
- Nalgonda
- పట్టణ ప్రజల సౌకర్యార్థం మేరకే లిటిల్ కార్డు డోర్ డెలివరీ యాప్.
పట్టణ ప్రజల సౌకర్యార్థం మేరకే లిటిల్ కార్డు డోర్ డెలివరీ యాప్.
ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలి.
నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి .లోకల్ గైడ్.
పట్టణ ప్రజల సౌకర్యార్థం మేరకే లిటిల్ కార్ట్ డోర్ డెలివరీ యాప్ ను ప్రారంభించారని, ప్రజలందరూ పాల్గొని వ్యాపారం ప్రారంభించిన వారిని ఆశీర్వదించాలని నల్లగొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి కోరారు. నల్లగొండ పట్టణం ముసంపల్లి రోడ్డు లోని ధరణి హోమ్స్ లో నూతనంగా ఏర్పాటు చేసిన యాప్ ను ప్రారంభించి మాట్లాడారు. ప్రజలకు కావలసిన వస్తువులు సామాగ్రి అన్ని రకాల వస్తువులను ప్రజలకు సకాలంలో అందించడం కోసం ఈ యాప్ను ప్రారంభించడం అభినందించారు. లిటిల్ కార్డ్ డోర్ డెలివరీ ఆఫ్ సీఈఓ మేకల సతీష్ రెడ్డి మాట్లాడుతూ 10 నిమిషాల్లో ఫాస్ట్ డెలివరీ యాప్ ద్వారా అందిస్తామన్నారు. ఉదయం 8 గంటలనుండి మిడ్ నైట్ వరకు సేవలు అందుబాటులో ఉంచుతామన్నారు. వీటి కాలనీ సూర్యాపేట ప్రాంతాల్లో ఈ యాప్ను కొనసాగిస్తామన్నారు. దీని ద్వారా అనిరుద్యోగులకు సైతం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని రాష్ట్రవ్యాప్తంగా దీన్ని విస్తరిస్తామన్నారు. ప్రజలకు కావలసిన అన్ని రకాల వస్తువులు పూజ సామాగ్రి గృహప్రవేశ డెకరేషన్ నిత్యవసర వస్తువులు స్టేషనరీ నూడిల్స్ ప్రజలకు కావలసిన అన్ని రకాల అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రోపరేటర్ స్వాతి, మేనేజర్ పోరెడ్డి ప్రమోద్ రెడ్డి , మర్రి నాగార్జున రెడ్డి , అలుగువెల్లి సత్యనారాయణ, సౌజన్య సృజన జానకి స్వాతి ఝాన్సీ దుర్గా విజయ సత్యరాణి సావిత్రి తదితరులు పాల్గొన్నారు.
