- District News
- సన్న వరి రైతులకు అలర్ట్.. ఆన్‌లైన్ నమోదు గడువు ఆగస్టు 10
సన్న వరి రైతులకు అలర్ట్.. ఆన్‌లైన్ నమోదు గడువు ఆగస్టు 10
బోనస్ కావాలంటే తప్పనిసరిగా ఆన్‌లైన్ నమోదు చేయించుకోండి : వ్యవసాయ శాఖ అధికారి మంజు మహేష్
Published On
By Ram Reddy
ములుగు జిల్లా, కొన్నాయిగూడెం : లోకల్ గైడ్ న్యూస్ :
వ్యవసాయ శాఖ అధికారి మంజు మహేష్ ఆధ్వర్యంలో కన్నాయిగూడెం మండలంలోని రైతులకు ముఖ్యమైన సూచన విడుదలైంది. వ్యవసాయ శాఖ ద్వారా ఎంపిక చేసిన 7 సన్న వరి రకాల విత్తనాలను కొనుగోలు చేసిన రైతులు తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో నమోదు చేయించుకోవాలని తెలిపారు. ఈ నమోదుకు చివరి తేదీ 10 ఆగష్టు 2026 అని పేర్కొన్నారు. రైతులు తాము విత్తనాలు కొనుగోలు చేసిన డీలర్ వద్దకు వెళ్లి ఆధార్ కార్డు మరియు పట్టాదారు పాస్ పుస్తకంతో ఆన్‌లైన్ నమోదు పూర్తి చేసుకోవాలని సూచించారు. గడువులోగా నమోదు చేయించుకోని రైతులు రాష్ట్ర ప్రభుత్వం అందించే బోనస్ పొందే అవకాశాన్ని కోల్పోయే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. అందువల్ల అర్హులైన రైతులందరూ ఆలస్యం చేయకుండా ఆగస్టు 10లోపు నమోదు ప్రక్రియ పూర్తి చేసుకోవాలని వ్యవసాయ శాఖ కోరింది.
Tags:
About The Author
Related Posts
Latest News
07 Aug 2026 19:39:23
ముఖ్యఅతిథిగా హాజరైన బిజెపి జిల్లా అధ్యక్షుడు యు. రమేష్ కుమార్.
- శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపిన పూజారి పాండు.
