లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో తల్లి పాల వారోత్సవాలు

గర్భిణీలు,తల్లులకు పండ్లు పంపిణీ

Published On
లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో తల్లి పాల వారోత్సవాలు

.

 

మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్)

మంచిర్యాల హైటెక్ సిటీ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కేంద్రం హమాలీవాడలోని అంగన్వాడీ కేంద్రంలో 
తల్లి పాల వారోత్సవాల కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి అవార్డు గ్రహీత,ప్రముఖ విద్యావేత్త గుండేటి యోగీశ్వర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు హాజరై తల్లి పాల ఆవశ్యకత,తల్లి బిడ్డకు పాలు ఇవ్వడం వలన తల్లికి,బిడ్డకు చేకూరే ప్రయోజనాలను వివరించారు.శిశు జన్మించిన మొదటి గంటలోనే తల్లి ముర్రుపాలు అందించాలని,6నెలల వరకు తప్పనిసరిగా తల్లి పాలు ఇస్తు పిల్లల వైద్యుల సలహా మేరకు 2సంవత్సరాల వరకు కొనసాగించాలని అన్నారు.తల్లి పాలు బిడ్డకు ఆరోగ్య ప్రధాయినిగా రోగ నిరోధక శక్తిని  పెంచుతుంది అన్నారు.అదేవిధంగా తల్లికి రొమ్ము క్యాన్సర్,ఊబకాయం,టైప్ టు డయాబెటిక్ లాంటి  వ్యాధులు రాకుండా రక్షణ కలుగుతుందని పేర్కొన్నారు.ఈ సందర్భంగా క్లబ్ సెక్రెటరీ చెట్ల రామయ్య పుట్టినరోజు పురస్కరించుకుని గర్భిణీలకు,తల్లులకు పండ్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రెసిడెంట్ రాజు పటేల్,క్లబ్ క్యాబినెట్ మెంబర్స్ ఐ తిరుపతి,సిహెచ్ హన్మంతరావు,సభ్యులు నరోత్తమరావు అంగన్వాడీ టీచర్ రమాదేవి,హమాలివాడలోని తల్లులు,గర్భిణీ స్త్రీలు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News