పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి.

Published On
పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి.

 

 నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి . లోకల్ గైడ్.


పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని నల్గొండ జిల్లా కలెక్టర్ కి ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం తెలంగాణ ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించారు. 
ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ మాట్లాడుతూ
11 కోట్ల పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్  స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థుల సంక్షేమ హాస్టల్స్ మెస్ ఛార్జీలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో సుమారు 50 లక్షల మంది విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల కాకపోవడం వల్ల ఉన్నత విద్యకు దూరం కావడం జరుగుతుంది. బహుజన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రవర్ణ పేద బిడ్డలు ఎంతోమంది ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 2020 .2021 సంవత్సరాల నుండి  ఇప్పటివరకు విడుదల కాకపోవడం వలన విద్యార్థులకు తీవ్ర నష్టం జరుగుతుంది. కావున రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ బకాయిలు వెంటనే విడుదల చేసి విద్యార్థులు ఉన్నత విద్య అభ్యసించేందుకు దోహదపడాలని కోరుచున్నాము అన్నారు.ఇంటర్ చదువుకున్న విద్యార్థులకు ఎప్పటినుండో 5000 స్కాలర్షిప్స్ ఇస్తున్నారు దానిని పదివేల రూపాయలకు ఇచ్చే విధంగా పెంచాలి 
ఎంబీఏ ఎంఎస్సీ విద్యార్థులకు ఎలా అయితే పూర్తి ఫీజును చెల్లిస్తున్నారు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థులకు ఎమ్మెస్సీ ఏం కం .ఎంఏ. తైతా పీజీ కోర్సులకు ప్రభుత్వమే పూర్తి ఫీజు చెల్లించాలి 
యూనివర్సిటీలో సెల్ ఫైనాన్స్ కోర్సుల్లో చదివి విద్యార్థులకు పూర్తి ఫీజును ప్రభుత్వం చెల్లించాలని విజ్ఞప్తి చేయడం జరిగింది .ఈ కార్యక్రమంలో  జిల వర్కింగ్ ప్రెసిడెంట్ సురేందర్ నాయక్  సుమిత్ రత్నం రాష్ట కమిటీ సభ్యులు  పేరేజి  సోల్మన్ రాజ్ సల్మాన్  వంటపాక నగేష్  బోడ్డు గణేష్ పోలే నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

తెలంగాణ "విప్లవ జ్యోతి" సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. తెలంగాణ "విప్లవ జ్యోతి" సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్.
ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి.  - తాండూర్ మున్సిపల్ చైర్‌పర్సన్ నీరజ బాల్‌రెడ్డి
నేడు శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి నిర్వహణ... జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్
పట్టణ ప్రజల సౌకర్యార్థం మేరకే లిటిల్ కార్డు డోర్ డెలివరీ యాప్. 
పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి.
నవీన్ కుటుంబానికి రూ.2 కోట్ల పరిహారం ఇవ్వాలి : అడ్డగోడ ఐలయ్య 
కారేపల్లి ప్రభుత్వ ఆసుపత్రిని 50 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేయాలి
కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను వెంటనే పునరుద్ధరించాలి-బి ఆర్ ఎస్ కాటేదాన్ డివిజన్ అధ్యక్షులు ఎస్. వెంకటేష్.