_ఎస్ ఎల్ ఎన్ గ్రూప్స్‌ నూతన శాఖ ప్రారంభం. _పశ్చిమ హైదరాబాద్‌లో విస్తరణకు మరో అడుగు

_ఎస్ ఎల్ ఎన్ గ్రూప్ చైర్మన్ కిరణ్ మై చేతుల మీదుగా ఘన ప్రారంభం

_మేనేజింగ్ డైరెక్టర్ జాలిగం రాకేష్ హాజరు
Published On
_ఎస్ ఎల్ ఎన్ గ్రూప్స్‌ నూతన శాఖ ప్రారంభం. _పశ్చిమ హైదరాబాద్‌లో విస్తరణకు మరో అడుగు

 

 



కుత్బుల్లాపూర్ సెప్టెంబర్ 25  (లోకల్ గైడ్ ప్రతినిధి)


రియల్‌ ఎస్టేట్‌ రంగంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఎస్ ఎల్ ఎన్ గ్రూప్స్ పశ్చిమ హైదరాబాద్‌లో తమ కార్యకలాపాలను మరింత విస్తరించే దిశగా కొత్త శాఖను ప్రారంభించింది. బీహెచ్ఈఎల్ లో ఏర్పాటు చేసిన నూతన శాఖ గ్రాండ్‌ ఓపెనింగ్‌ కార్యక్రమం సెప్టెంబర్‌ 22న ఘనంగా నిర్వహించారు.బీహెచ్లోని పి ఎస్ ఆర్ ప్లాజాలో, రాయల్‌ డైక్ బోరెంగూస్ క్యాంప్ సమీపంలో ఉదయం 10 గంటలకు జరిగిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎస్ ఎల్ ఎన్ గ్రూప్స్‌ ప్రతినిధులు, సిబ్బంది, శ్రేయోభిలాషులు, ఆహ్వానితులు హాజరయ్యారు.పశ్చిమ హైదరాబాద్‌లో పెరుగుతున్న రియల్‌ ఎస్టేట్‌ అవకాశాలను దృష్టిలో ఉంచుకుని కొత్త శాఖను ఏర్పాటు చేసినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. వినియోగదారులకు మరింత చేరువగా సేవలు అందించడంతో పాటు, కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన సమాచారాన్ని అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా శాఖను ప్రారంభించినట్లు పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఎస్ ఎల్ ఎన్ గ్రూప్స్‌ ప్రతినిధులు మాట్లాడుతూ, కొత్త బి హెచ్ఈఎల్ శాఖ ప్రారంభం సంస్థ ప్రస్థానంలో మరో ముఖ్యమైన మైలురాయిగా నిలిచిందన్నారు. సంస్థ అభివృద్ధికి సహకరిస్తున్న కస్టమర్లు, సిబ్బంది, భాగస్వాములు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలిపారు.
“కలిసి ఎదుగుదాం.. కలిసి సాధిద్దాం” అనే లక్ష్యంతో ఎస్ ఎల్ ఎన్ గ్రూప్స్‌ మరింత విస్తరణ దిశగా ముందుకు సాగుతుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు

Tags:

About The Author

Latest News

గణపయ్యకు ఘన వీడ్కోలు... సర్పంచ్ రంజిత్ కుమార్ ఉత్సాహం! గణపయ్యకు ఘన వీడ్కోలు... సర్పంచ్ రంజిత్ కుమార్ ఉత్సాహం!
        కారేపల్లి (సింగరేణి), సెప్టెంబర్ 24 (లోకల్ గైడ్ న్యూస్) : సింగరేణి మండలం గాదెపాడు గ్రామపంచాయతీ పరిధిలోని బొడ్రాయి సెంటర్‌లో యాదవ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు
అయ్యవారపేటలో ఘనంగా 'పోషణ్ మాసం' అవగాహన సదస్సు..
_ఎస్ ఎల్ ఎన్ గ్రూప్స్‌ నూతన శాఖ ప్రారంభం. _పశ్చిమ హైదరాబాద్‌లో విస్తరణకు మరో అడుగు
ఎమ్మెల్యే పిఎస్ఆర్ పై వ్యాఖ్యలు చేయడం అవివేకం.
విద్యార్థులకు అందుబాటులో వసతి గృహం ఏర్పాటు 
పోరాట వీరుడు పోతుగంటి పోశెట్టి నివాళి గీతం ఆవిష్కరణ.
ఎస్సీ, ఎస్టీల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి.                         అట్రాసిటీ కేసుల పరిష్కారానికి వేగవంతమైన చర్యలు.