గణపయ్యకు ఘన వీడ్కోలు... సర్పంచ్ రంజిత్ కుమార్ ఉత్సాహం!

గాదెపాడు బొడ్రాయి సెంటర్‌లో యాదవ యూత్ ఆధ్వర్యంలో నిమజ్జన వేడుకలు

Published On
గణపయ్యకు ఘన వీడ్కోలు... సర్పంచ్ రంజిత్ కుమార్ ఉత్సాహం!

 

 

కారేపల్లి (సింగరేణి), సెప్టెంబర్ 24 (లోకల్ గైడ్ న్యూస్) : సింగరేణి మండలం గాదెపాడు గ్రామపంచాయతీ పరిధిలోని బొడ్రాయి సెంటర్‌లో యాదవ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహ నిమజ్జన వేడుకలు గురువారం ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. ఈ వేడుకల్లో గాదెపాడు గ్రామ సర్పంచ్ భూక్యా రంజిత్ కుమార్ పాల్గొని భక్తులతో కలిసి గణనాథుడికి ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా సర్పంచ్ రంజిత్ కుమార్ మాట్లాడుతూ.. వరసిద్ధి వినాయకుడి ఆశీస్సులు ప్రజలందరిపై మెండుగా ఉండాలని, ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. గ్రామంలో ప్రజలు ఐకమత్యంతో పండుగలను ఆనందంగా నిర్వహించుకోవడం అభినందనీయమన్నారు. నిమజ్జన వేడుకల్లో యువత, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని డోలు వాయిద్యాలు, డీజే సౌండ్ల నడుమ ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ గణనాథుడిని నిమజ్జనానికి తరలించారు. భక్తుల జయజయధ్వానాలతో బొడ్రాయి సెంటర్ సందడిగా మారింది. నిమజ్జన కార్యక్రమంలో గ్రామపంచాయతీ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సర్పంచ్ భూక్యా రంజిత్ కుమార్ ఆధ్వర్యంలో తగిన జాగ్రత్తలు, ఏర్పాట్లు చేపట్టారు. నిమజ్జన మార్గంలో భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించడంతో పాటు కార్యక్రమం ప్రశాంతంగా జరిగేలా నిర్వాహకులు చర్యలు తీసుకున్నారు. యాదవ యూత్ సభ్యులు, గ్రామ ప్రజలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

గణపయ్యకు ఘన వీడ్కోలు... సర్పంచ్ రంజిత్ కుమార్ ఉత్సాహం! గణపయ్యకు ఘన వీడ్కోలు... సర్పంచ్ రంజిత్ కుమార్ ఉత్సాహం!
        కారేపల్లి (సింగరేణి), సెప్టెంబర్ 24 (లోకల్ గైడ్ న్యూస్) : సింగరేణి మండలం గాదెపాడు గ్రామపంచాయతీ పరిధిలోని బొడ్రాయి సెంటర్‌లో యాదవ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు
అయ్యవారపేటలో ఘనంగా 'పోషణ్ మాసం' అవగాహన సదస్సు..
_ఎస్ ఎల్ ఎన్ గ్రూప్స్‌ నూతన శాఖ ప్రారంభం. _పశ్చిమ హైదరాబాద్‌లో విస్తరణకు మరో అడుగు
ఎమ్మెల్యే పిఎస్ఆర్ పై వ్యాఖ్యలు చేయడం అవివేకం.
విద్యార్థులకు అందుబాటులో వసతి గృహం ఏర్పాటు 
పోరాట వీరుడు పోతుగంటి పోశెట్టి నివాళి గీతం ఆవిష్కరణ.
ఎస్సీ, ఎస్టీల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి.                         అట్రాసిటీ కేసుల పరిష్కారానికి వేగవంతమైన చర్యలు.