- District News
- ఎమ్మెల్యే పిఎస్ఆర్ పై వ్యాఖ్యలు చేయడం అవివేకం.
ఎమ్మెల్యే పిఎస్ఆర్ పై వ్యాఖ్యలు చేయడం అవివేకం.
మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్)
గత 2రోజుల క్రితం మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావుపై నస్పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ సురిమిల్ల వేణు,సుధమల్ల అశోక్ తేజ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని దళిత సంఘం నాయకులు తెలిపారు.మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నస్పూర్ ప్రెస్ క్లబ్‌లో గురువారం దళిత సంఘం నాయకులు పాత్రికేయుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతు మంచిర్యాల ఎమ్మెల్యే 2020 సంవత్సరంలో మున్సిపల్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సురిమిల్ల వేణుకు 2023లో మున్సిపల్ చైర్మన్ పదవి దక్కేలా సహకరించారని పేర్కొన్నారు.ఒక సాధారణ కార్యకర్తగా ఉన్న సమయంలో రాజకీయంగా ప్రోత్సహించి పదవి దక్కేలా చేసిన వ్యక్తిపైనే ఆయన విమర్శలు చేయడం సరికాదని అన్నారు.వ్యక్తిగత విమర్శలకు దూరంగా ఉండి,రాజకీయ భేదాలను ప్రజాస్వామ్య పద్ధతిలో వ్యక్తపరచాలని సూచించారు.తమ ఎమ్మెల్యేపై భవిష్యత్తులో ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేయకుండా సంయమనం పాటించాలని వారు హెచ్చరించారు..
మంచిర్యాల జిల్లా ఎస్సీ సెల్ నూతన కార్యవర్గం..
గతంలో జరిగిన నియామకాన్ని రద్దు చేస్తు తాజాగా నూతన కమిటీని ఎన్నుకున్నారు.మంచిర్యాల ఎమ్మెల్యే సిఫార్సు మేరకు జిల్లా అధ్యక్షులు మినహా మిగతా కమిటీని పీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర చైర్ పర్సన్ మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ప్రకటించారు.జిల్లా ఉపాధ్యక్షులగా కొంగల నవీన్,కుంటాల శంకర్,జిల్లా ప్రధాన కార్యదర్శులగా అడ్లూరి తిరుపతి,చిలుక మల్లేష్,మహంతి రంజిత్,జిల్లా కార్యదర్శులు బత్తుల వెంకటస్వామి,ఆర్నకొండ నరేష్,గజ్జెల్లి దయాకర్,శాతరాజు రమేష్,చిప్పకుర్తి లచ్చయ్య జిల్లా సంయుక్త కార్యదర్శులు లంకా భార్గవ్,అవునూరి రమేష్,జిల్లా అధికార ప్రతినిధి మడిపెల్లి స్వామి,సోషల్ మీడియా ఇంఛార్జి సిర్రా దివాకర్,దండేపల్లి మండల అధ్యక్షులు ఆరేపల్లి రమేష్,లక్షెట్టిపేట్ మండల అధ్యక్షులు లింగంపల్లి వెంకటేశం,లక్షెట్టీపేట్ టౌన్ అధ్యక్షులు గుత్తికొండ శ్రీధర్,మంచిర్యాల అధ్యక్షులు పత్తి తిరుపతి,హాజీపూర్ మండల అధ్యక్షులు,జాడి విజమ్,నస్పూర్ అధ్యక్షులు పండుగ శ్రీనివాస్ లను నియమించినట్లు తెలిపారు.ఈ సందర్భంగా నూతన ఎస్సీ సెల్ కమిటీ సభ్యులందరికీ ఎమ్మెల్యే హార్దిక శుభాకాంక్షలు తెలిపారు.
