- District News
- Warangal
- 26వ రోజుకు చేరిన పాలిటెక్నిక్ విద్య పరిరక్షణ ఉద్యమం
26వ రోజుకు చేరిన పాలిటెక్నిక్ విద్య పరిరక్షణ ఉద్యమం
ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఉమ్మడి. వరంగల్ జిల్లా.లో
హనుమకొండ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్11
జీవో ఎం ఎస్ నెంబర్ 97 పై ఆందోళన కొనసాగిస్తు –లంచ్ అవర్‌లో మోకాళ్లపై నిలబడి ఫ్యాకల్టీ వినూత్న నిరసన తెలిపారు.
వరంగల్,తెలంగాణ రాష్ట్రంలోని పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థకు సంబంధించిన జీవో ఎంఎస్ నెంబర్ 97 నిర్ణయాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ప్రభుత్వ పాలిటెక్నిక్ వరంగల్‌లో కొనసాగుతున్న నిరసన కార్యక్రమాలు 26వ రోజుకు చేరుకున్నాయి. పాలిటెక్నిక్ విద్య యొక్క ప్రత్యేకత, విద్యా ప్రమాణాలు, విద్యార్థుల భవిష్యత్తు,బోధన, బోధనేతర సిబ్బంది ప్రయోజనాలను పరిరక్షించాలనే డిమాండ్‌తో ఈ ఆందోళన కొనసాగుతోందని అన్నారు.ఈ సందర్భంగా ప్రభుత్వ పాలిటెక్నిక్ వరంగల్‌లోని ఫ్యాకల్టీ సభ్యులు శుక్రవారం రోజున లంచ్ అవర్‌లో వినూత్న నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా ఫ్యాకల్టీ సభ్యులు మోకాళ్లపై నిలబడి తమ నిరసనను తెలియజేశారు. పాలిటెక్నిక్ విద్య పరిరక్షణ, విద్యార్థుల భవిష్యత్తు, సిబ్బంది ప్రయోజనాల కోసం తమ డిమాండ్లను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించాలని ఈ వినూత్న నిరసన ద్వారా కోరారు.పాలిటెక్నిక్ విద్య పరిరక్షణకు ఐక్య స్వరం
జీవో ఎం ఎస్ నెంబర్ 97 వల్ల రాష్ట్రంలోని ప్రస్తుత పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థ, దాని అకడమిక్ నిర్మాణం, పరిపాలన, సిబ్బంది సేవా అంశాలు, విద్యార్థుల విద్యా, ఉపాధి అవకాశాలు, అలాగే డిప్లొమా సాంకేతిక విద్య భవిష్యత్తుపై ప్రభావం ఉండే అవకాశం ఉన్నందున, అన్ని వర్గాలతో సమగ్రంగా చర్చించి నిర్ణయం తీసుకోవాలని పాలిటెక్నిక్ వర్గాలు కోరుతున్నాయి.
పాలిటెక్నిక్ విద్యకు ఉన్న ప్రత్యేక గుర్తింపు, లక్ష్యాలు, విద్యా ప్రమాణాలను కాపాడుతూ, విద్యార్థులు, బోధనా సిబ్బంది, బోధనేతర ఉద్యోగుల ప్రయోజనాలను పరిరక్షించాల్సిన అవసరం ఉందని ఫ్యాకల్టీ సభ్యులు పేర్కొన్నారు.మోకాళ్లపై నిలబడి వినూత్న నిరసన తెలిపారు.ఈ
ఉద్యమంలో భాగంగా 26వ రోజు లంచ్ అవర్‌లో మోకాళ్లపై నిలబడి వినూత్నంగా నిరసన వ్యక్తం చేయడం ద్వారా ఫ్యాకల్టీ సభ్యులు తమ ఆవేదనను, పాలిటెక్నిక్ విద్య పరిరక్షణ పట్ల తమ నిబద్ధతను చాటుకున్నారు.
రోజువారీ విద్యా కార్యక్రమాలకు అంతరాయం కలగకుండా లంచ్ విరామ సమయంలో శాంతియుతంగా ఈ నిరసన చేపట్టారు. ప్రభుత్వం పాలిటెక్నిక్ వర్గాల డిమాండ్లను పరిగణనలోకి తీసుకుని, జీవో ఎం ఎస్ నెంబర్ 97 పై సమగ్ర చర్చ నిర్వహించి తగిన నిర్ణయం తీసుకోవాలని వారు కోరారు.
26వ రోజు కూడా కొనసాగుతున్న ఈ నిరసన ద్వారా పాలిటెక్నిక్ విద్య పరిరక్షణకు తమ ఐక్యతను, నిబద్ధతను చాటుతున్నామని నిర్వాహకులు తెలిపారు.
