పోరాట వీరుడు పోతుగంటి పోశెట్టి నివాళి గీతం ఆవిష్కరణ.

Published On
పోరాట వీరుడు పోతుగంటి పోశెట్టి నివాళి గీతం ఆవిష్కరణ.

 

 

బెల్లంపల్లి (లోకల్ గైడ్)

 

కమ్యూనిస్టు నాయకుడు,స్వాతంత్ర్య సమరయోధుడు,తెలంగాణ సాయుధ పోరాట వీరుడు పోతుగంటి పోశెట్టి నివాళి గీతాన్ని గురువారం స్థానిక సీపీఐ పట్టణ కార్యాలయంలో ఆయన కుమారుడు పోతుగంటి అశోక్ ఆవిష్కరించారు.పోశెట్టి 45వ వర్ధంతిని పురస్కరించుకుని తొలుత ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా సీపీఐ నాయకులు మాట్లాడుతు బెల్లంపల్లిలో కమ్యూనిస్టు పార్టీకి బలమైన పునాది వేయడంలో పోశెట్టి కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు.పార్టీని బెల్లంపల్లికి తీసుకురావడంతో పాటు నాయకులను తీర్చిదిద్ది,కార్యకర్తలను సమీకరించి పార్టీని బలోపేతం చేశారని తెలిపారు.ఆయన నాయకత్వంలో బెల్లంపల్లిలో సీపీఐ కంచుకోటగా ఎదిగిందన్నారు.ఆసిఫాబాద్ సమితికి 3సార్లు ఉపాధ్యక్షుడిగా,ఒకసారి అధ్యక్షుడిగా,చాకేపల్లికి వరుసగా 4సార్లు ఏకగ్రీవ సర్పంచ్‌గా ప్రజలకు సేవలందించి ప్రజల మనిషిగా వారి గుండెల్లో నిలిచిపోయారని గుర్తుచేశారు.ఆయన పోరాట జీవితం,ప్రజా సేవ,కమ్యూనిస్టు ఉద్యమానికి ఆయన చేసిన కృషిని భావితరాలకు పరిచయం చేసే ఉద్దేశంతో ఈ నివాళి గీతాన్ని రూపొందించినట్లు గీత రచయిత పోతుగంటి భరత్ రుషి తెలిపారు.పోరాట యోధుడిగా ఆయన ప్రదర్శించిన స్ఫూర్తి,ప్రజా నాయకుడిగా అందించిన సేవలు నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ కార్యదర్శి మిట్టపల్లి వెంకటస్వామి,పట్టణ కార్యదర్శి ఆడెపు రాజమౌళి,పట్టణ సహాయ కార్యదర్శి బొల్లం తిలక్ అంబేద్కర్,తాండూరు మండల కార్యదర్శి కొండు బానేష్,గుండా చంద్రమాణిక్యం,అక్కెపల్లి బాపు,దాసరి తిరుపతిగౌడ్,బొంకురి రామచందర్,స్వామిదాస్,ఇనుముల రాయమల్లు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

గణపయ్యకు ఘన వీడ్కోలు... సర్పంచ్ రంజిత్ కుమార్ ఉత్సాహం! గణపయ్యకు ఘన వీడ్కోలు... సర్పంచ్ రంజిత్ కుమార్ ఉత్సాహం!
        కారేపల్లి (సింగరేణి), సెప్టెంబర్ 24 (లోకల్ గైడ్ న్యూస్) : సింగరేణి మండలం గాదెపాడు గ్రామపంచాయతీ పరిధిలోని బొడ్రాయి సెంటర్‌లో యాదవ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు
అయ్యవారపేటలో ఘనంగా 'పోషణ్ మాసం' అవగాహన సదస్సు..
_ఎస్ ఎల్ ఎన్ గ్రూప్స్‌ నూతన శాఖ ప్రారంభం. _పశ్చిమ హైదరాబాద్‌లో విస్తరణకు మరో అడుగు
ఎమ్మెల్యే పిఎస్ఆర్ పై వ్యాఖ్యలు చేయడం అవివేకం.
విద్యార్థులకు అందుబాటులో వసతి గృహం ఏర్పాటు 
పోరాట వీరుడు పోతుగంటి పోశెట్టి నివాళి గీతం ఆవిష్కరణ.
ఎస్సీ, ఎస్టీల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి.                         అట్రాసిటీ కేసుల పరిష్కారానికి వేగవంతమైన చర్యలు.