- District News
- విద్యార్థులకు అందుబాటులో వసతి గృహం ఏర్పాటు
విద్యార్థులకు అందుబాటులో వసతి గృహం ఏర్పాటు
రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేకానంద.
మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్)

విద్యారంగ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని,ఇందులో భాగంగా విద్యార్థుల సౌకర్యార్థం షెడ్యూల్ కులాల సంక్షేమ వసతి గృహ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర కార్మిక,ఉపాధి శిక్షణ,కర్మాగార,గనులు భూగర్భ శాఖల మంత్రి గడ్డం వివేకానంద అన్నారు.గురువారం జిల్లాలోని జైపూర్ మండల కేంద్రంలో షెడ్యూల్డ్ కులాల సంక్షేమ వసతి గృహ నిర్మాణానికి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్,డిసిపి ఎ భాస్కర్,షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఉపసంచాలకులు చాతరాజుల దుర్గాప్రసాద్,మండల తహసిల్దార్ వనజా రెడ్డి,మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీపతి బాపు,డిసిసి ప్రతినిధి రఘునాథ్, చెన్నూరు మార్కెట్ కమిటీ చైర్మన్ తివారి లతో కలిసి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి మాట్లాడుతు షెడ్యూల్ కులాల విద్యార్థుల సంక్షేమం దిశగా 1కోటి 81లక్షల రూపాయల సిఎస్ఆర్ నిధులతో వసతి గృహ నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు.చెన్నూరులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టామని,1కోటి 50లక్షలలతో జూనియర్ కళాశాలలో అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు.అదేవిదంగా మండలంలోని సోమనపల్లి గ్రామంలో 200కోట్లతో 2వేల 500మంది విద్యార్థులకు వసతి కల్పించేలా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు.అంతేకాకుండా చెన్నూరు ప్రాంతంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని,కోటపల్లి మండలంలో సైతం షెడ్యూల్ కులాల వసతి గృహ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.మందమర్రి ప్రాంతంలోని భూములలో సింగరేణి సంస్థ సమన్వయంతో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం,చెన్నూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన100పడకల ప్రభుత్వ ఆసుపత్రిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని,రామకృష్ణాపూర్ సమీప ప్రాంతాల ప్రజల కోసం మందమర్రి మండల కేంద్రంలో 50పడకలతో ఆసుపత్రి ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిపారు.ఈ ప్రాంత నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే దిశగా ఆర్ కె ఓసి లో నూతన గని ఏర్పాటుకు కృషి చేస్తున్నామని,మండల కేంద్రంలోని సింగరేణి స్కిల్ డెవలప్మెంట్ కేంద్రంలో జర్మనీ భాష నేర్పించి విదేశాలలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.వచ్చే సంవత్సరం గోదావరి పుష్కరాల నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా 70కోట్ల రూపాయలతో పుష్కర ఘాట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.ముందుగా జిల్లా కలెక్టర్,మండల తహసిల్దార్ తో కలిసి మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి విద్యార్థులకు అందిస్తున్న సదుపాయాలు,విద్యా బోధన పరిసరాలను పరిశీలించారు.ఇంటర్మీడియట్ విద్యార్థులతో మాట్లాడి వసతుల కల్పనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.విద్యార్థులకు బ్యాగులు,షూస్ పంపిణీ చేశారు.
