ఎస్సీ, ఎస్టీల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి.                         అట్రాసిటీ కేసుల పరిష్కారానికి వేగవంతమైన చర్యలు. 

ఎస్సీ, ఎస్టీల హక్కుల పరిరక్షణకు ప్రాధాన్యత    పెండింగ్ సమస్యల పరిష్కారానికి సమన్వయంతో చర్యలు. 

ఎస్సీ, ఎస్టీల సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలి -రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య. 
Published On
ఎస్సీ, ఎస్టీల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి.                         అట్రాసిటీ కేసుల పరిష్కారానికి వేగవంతమైన చర్యలు. 

IMG-20260924-WA0484IMG-20260924-WA0483రంగారెడ్డి జిల్లా బ్యూరో, ( లోకల్ గైడ్ ):                       జిల్లాలో ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన అన్ని సమస్యలను సత్వరమే పరిష్కరించేలా అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సూచించారు. గురువారం కొంగరకలాన్ లోని 
జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలోని సమావేశ మందిరంలో రాష్ట్ర ఎస్.సి.,ఎస్.టి కమిషన్‌ చైర్మన్‌ బక్కి వెంకటయ్య, అదనపు కలెక్టర్లు కె.కిరణ్మయి, చంద్రా రెడ్డి, డిసిపి కె.నారాయణ రెడ్డి  ఆధ్వర్యంలో పోలీసు, రెవెన్యూ అధికారులు, ఎస్.సి.,ఎస్.టి అభివృద్ధి, సంక్షేమ శాఖల అధికారులు, ఎస్సీ, ఎస్టీల సంక్షేమం, హక్కుల పరిరక్షణ, అట్రాసిటీ కేసులు, భూ సమస్యలు తదితర అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు.
         ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీలపై నమోదైన అట్రాసిటీ కేసుల పురోగతిని కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సమీక్షించారు. కేసుల దర్యాప్తు, బాధితులకు న్యాయం, పరిహారం చెల్లింపు తదితర అంశాల్లో నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు. కేసుల పరిష్కారంలో అనవసర జాప్యం జరగకుండా పోలీసు, రెవెన్యూ, సంక్షేమ శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని తెలిపారు.
         జిల్లాలో ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన భూ సమస్యలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, విద్య, ఉపాధి, మౌలిక వసతులు తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని, ప్రజల నుంచి అందే ఫిర్యాదులను నిబంధనల మేరకు పరిశీలించి పరిష్కరించాలని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ వర్గాల అభివృద్ధి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలపై క్షేత్రస్థాయిలో విస్తృత అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. ఎస్సీ, ఎస్టీ కాలనీలు, ఆవాస ప్రాంతాల్లో తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్, రహదారులు, విద్యా సంస్థలు తదితర మౌలిక వసతుల పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని తెలిపారు.
         అట్రాసిటీ నిరోధక చట్టం, ఇతర సంబంధిత చట్టాల అమలుపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని కమిషన్ చైర్మన్ పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీల హక్కుల పరిరక్షణలో ప్రభుత్వ యంత్రాంగం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, బాధితులకు తక్షణ సహాయం, న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమస్యలను క్షేత్రస్థాయిలో గుర్తించి, పరిష్కారానికి నిర్దిష్ట కార్యాచరణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
జిల్లా అదనపు కలెక్టర్ చంద్రా రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ బాధితులకు ఇవ్వాల్సిన నష్టపరిహారం, ఓవర్సీస్ స్కాలర్షిప్, కులాంతర వివాహాల ప్రోత్సాలకు సంబంధించి వివరాలను వెంటనే అందించాలన్నారు. నివేదికల ఆధారంగా నష్టపరిహారాలను అందిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా సంబంధిత శాఖల అధికారులు జిల్లాలో ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి సంబంధించి అమలు చేస్తున్న కార్యక్రమాలు, అట్రాసిటీ కేసుల పురోగతి, పెండింగ్ సమస్యలు, పరిష్కరించిన అంశాలపై కమిషన్ చైర్మన్‌కు వివరాలు అందించారు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమం, అభివృద్ధి మరియు హక్కుల పరిరక్షణకు జిల్లా యంత్రాంగం సమన్వయంతో పని చేస్తుందని అధికారులు తెలిపారు.
ఈ సమీక్ష సమావేశంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు రాంబాబు నాయక్, జిల్లా శంకర్, జిల్లా డీఎంసీ సభ్యులు విజయ్ కుమార్, బి.రాజు, లక్పతి నాయక్, యాదగిరి, పి.నర్సిములు, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి రామరావ్, ఎస్.సి డెవలోప్మెంట్ అధికారి పద్మావతి, జిల్లా అధికారులు, ఆర్డీఓలు, తహాసిల్దారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపిడిఒలు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

గణపయ్యకు ఘన వీడ్కోలు... సర్పంచ్ రంజిత్ కుమార్ ఉత్సాహం! గణపయ్యకు ఘన వీడ్కోలు... సర్పంచ్ రంజిత్ కుమార్ ఉత్సాహం!
        కారేపల్లి (సింగరేణి), సెప్టెంబర్ 24 (లోకల్ గైడ్ న్యూస్) : సింగరేణి మండలం గాదెపాడు గ్రామపంచాయతీ పరిధిలోని బొడ్రాయి సెంటర్‌లో యాదవ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు
అయ్యవారపేటలో ఘనంగా 'పోషణ్ మాసం' అవగాహన సదస్సు..
_ఎస్ ఎల్ ఎన్ గ్రూప్స్‌ నూతన శాఖ ప్రారంభం. _పశ్చిమ హైదరాబాద్‌లో విస్తరణకు మరో అడుగు
ఎమ్మెల్యే పిఎస్ఆర్ పై వ్యాఖ్యలు చేయడం అవివేకం.
విద్యార్థులకు అందుబాటులో వసతి గృహం ఏర్పాటు 
పోరాట వీరుడు పోతుగంటి పోశెట్టి నివాళి గీతం ఆవిష్కరణ.
ఎస్సీ, ఎస్టీల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి.                         అట్రాసిటీ కేసుల పరిష్కారానికి వేగవంతమైన చర్యలు.