_గురువులకు ఘన సన్మానం.. కళలకు పెద్దపీట

_గురువందనం–వినాయక చవితి వేడుకలు ఘనంగా.. నాట్య గురువు డాక్టర్ నిర్మలా విశ్వేశ్వరరావుకు సన్మానం

_కార్యక్రమాన్ని జై జవాన్.. జై కిసాన్.. జై కళాకార్ & గ్లోబల్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో నిర్వహించగా, సంస్థ అధ్యక్షుడు  లయన్ కె.వి. రమణారావు. ఏర్పాట్లను పర్యవేక్షించారు.
Published On
_గురువులకు ఘన సన్మానం.. కళలకు పెద్దపీట

 

 

హైదరాబాద్ సెప్టెంబర్ 11 లోకల్ గైడ్ ప్రతినిధి)

జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం, వినాయక చవితి సందర్భంగా జై జవాన్.. జై కిసాన్.. జై కళాకార్ & గ్లోబల్ఈవెంట్స్ఆధ్వర్యంలోనిర్వహించినగురువందనం–వినాయక చవితి వేడుకలు శుక్రవారం లక్డీకపూల్‌లోని రవీంద్రభారతి మెయిన్ హాల్‌లో ఘనంగా జరిగాయి. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, కళాకారులు, నృత్య, సంగీత గురువులు పాల్గొన్నారు.కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ శ్రీ రాజయ్య శిరిసిల్ల, తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ శ్రీ కోలేటి దామోదర్ గుప్తా ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ప్రముఖ టీవీ, సినీ నటి శ్రీమతి జ్యోతి రెడ్డి గౌరవ అతిథిగా హాజరయ్యారు.ఫిల్మ్ అండ్ టీవీ కొరియోగ్రాఫర్ డా. శ్రీకాంత్ గౌడ్, నిర్మలా నృత్య నికేతన్ డైరెక్టర్ డా. నిర్మలా విశ్వేశ్వరరావు, శివ పార్వతి నాట్య అకాడమీ వ్యవస్థాపకుడు, దర్శకుడు శ్రీ చెట్టి నాగశేఖర్, ఎం.ఏ. ఆర్ట్స్, గిన్నిస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ శ్రీమతి షీలా రమణి, స్పందన నృత్య కేళి స్కూల్ ఆఫ్ డాన్స్, స్పందన చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు, డైరెక్టర్ డా. నమాని రవికుమార్ తదితరులు ప్రత్యేక అతిథులుగా పాల్గొన్నారు.నాట్య గురువు: డాక్టర్ నిర్మల విశ్వేశ్వరరావు సన్మానం  కార్యక్రమంలోనాట్యరంగానికి విశేష సేవలు అందిస్తున్న డాక్టర్నిర్మలావిశ్వేశ్వరరావును ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కోలేటి దామోదర గుప్తా, కె.వి. రమణారావు, దైవజ్ఞశర్మ తదితరులు ఆమెను సత్కరించి అభినందనలు తెలిపారు.కళలు, సంగీతం, నృత్యం వంటి భారతీయ సంప్రదాయ కళారూపాలను భావితరాలకు అందించడంలో గురువుల పాత్ర ఎంతో కీలకమని కార్యక్రమ నిర్వాహకులు పేర్కొన్నారు. కళలను ప్రోత్సహిస్తూ గురువులను గౌరవించడం సమాజ బాధ్యతగా భావించాలని వారు అన్నారు.పలువురు కళా గురువులకు గుర్తింపుకార్యక్రమంలో సంగీత ఉపాధ్యాయులుగా  చండీ ప్రసన్న కరంచెటి ( షణ్ముఖప్రియ సంగీత అకాడమీ, గుల్బర్గా), శ్రీమతి భారతి,  కొండపల్లి నవ్య (సారాణి మ్యూజిక్ అకాడమీ) తదితరులు పాల్గొన్నారు.డ్యాన్స్ టీచర్లుగా మిస్ రెధి బిల్లకంటి (కలరంజని డాన్స్ అకాడమీ), మిస్ ఏ. లలిత జ్యోతిర్మయి (సారాణి మ్యూజిక్ అకాడమీ), మిస్ ఐశ్వర్య (శ్రీదేవి గోవిందరాజు నాట్యశాల), మిస్ వడ్డి జ్ఞానేశ్వరి (నాట్యేశ్వరి కళాక్షేత్ర & భారతి అకాడమీ), మిస్ వందన తోట, మిస్ నివేదిత పి.ఎన్. భట్ (నివేధ్యం కేరళ క్లాసికల్ డాన్స్ అకాడమీ), యోగా–డ్యాన్స్ టీచర్ కె. పూర్ణ సాయి (ఎస్‌ఎస్‌డి యోగశాల & కళాక్షేత్ర) తదితరులు పాల్గొన్నారు.ప్రపంచ రికార్డుల్లో నమోదుకార్యక్రమంలో పాల్గొన్న గురువులు, మాస్టర్స్ పేర్లను నిబంధనలు, షరతులకు లోబడి వివిధ ప్రపంచ రికార్డు సంస్థల రికార్డుల్లో నమోదు చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. క్లాసికల్ మ్యూజిక్ మాస్టర్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, సంగీత–నృత్య మాస్టర్స్ బుక్ ఆఫ్ రికార్డ్స్, క్లాసికల్ డాన్స్ మాస్టర్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, ఆల్ ఆర్ట్‌ఫార్మ్స్ మాస్టర్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వంటి విభాగాల్లో నమోదు చేయనున్నట్లు పేర్కొన్నారు.ప్రతి పాల్గొనేవారికి ప్రశంసా పత్రాన్ని అందజేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు, భక్తి, కళారూపాల పరిరక్షణకు వేదికగా ఈ కార్యక్రమం నిలిచింది.ఈ కార్యక్రమాన్ని జై జవాన్.. జై కిసాన్.. జై కళాకార్ & గ్లోబల్ ఈవెంట్స్ ఆధ్వర్యంలోనిర్వహించగా, సంస్థ అధ్యక్షుడు  లయన్ కె.వి. రమణారావు తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. “యువతకు జయము.. రైతుకు జయము.. కళాకారునికి జయము” అనే సందేశంతో కళాకారులను, గురువులను ప్రోత్సహించాల్సిన అవసరాన్ని నిర్వాహకులు వివరించారు.

Tags:

About The Author

Latest News

పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించి నేర నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలి. పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించి నేర నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలి.
    నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి. లోకల్ గైడ్.  జిల్లాలో నేర నియంత్రణ, పెండింగ్ కేసుల దర్యాప్తు, ఎన్ బి డబ్ల్యు పెండింగ్ కేసుల పరిష్కారం, ఆస్తి
గీతాంజలి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ లో ఘనంగా వినాయక చవితి ముందస్తు వేడుకలు
26వ రోజుకు చేరిన పాలిటెక్నిక్ విద్య పరిరక్షణ ఉద్యమం
ఖరీఫ్ ధాన్యం సేకరణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి – అదనపు కలెక్టర్ (రెవెన్యూ) చంద్రా రెడ్డి
లోకపల్లిలో జనజాతర
పేదలపై నిర్లక్ష్యం.. హామీలు బేఖాతర్!
రోడ్డు మరమ్మత్తుల పనులను చేపట్టండి